Ginger Oil For Hair : ఇది రాస్తే మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది!-ginger oil for hair growth white hair to black hair hair loss reduce tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ginger Oil For Hair Growth White Hair To Black Hair Hair Loss Reduce Tips

Ginger Oil For Hair : ఇది రాస్తే మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది!

Anand Sai HT Telugu
May 25, 2023 11:36 AM IST

Ginger Oil For Hairs : చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే.. బయటపడొచ్చు. ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

జుట్టు పెరుగుదల చిట్కాలు
జుట్టు పెరుగుదల చిట్కాలు (unsplash)

ఈ కాలంలో జుట్టు సమస్యలు(Hair Problems) అనేవి కామన్ అయిపోయాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా జుట్టు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం, అలర్జీ, నీరు, పోషకాహార లోపంలాంటి కారణాలతో జుట్టుకు అనేక సమస్యలు వస్తాయి. జుట్టు రాలడం(Hair Loss), చుండ్రు(Dandruff)లాంటి సమస్యల బారిన పడుతారు. జుట్టుకు సరైన పోషణ లభిస్తే.. జుట్టు బాగా పెరుగుతుంది. కొన్ని చిట్కాలను పాటించాలి.

జుట్టు కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు(Hair)ను బాగా పెరిగేలా చేయడంలో కెరాటిన్ అనే ప్రోటిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టుకు కెరాటిన్ అందేలా చూడాలి. దీంతో జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. జుట్టు పెరిగేందుకు ఆస్కారం ఉంటుది. జుట్టు పెరిగేందుకు జింజర్ అయిల్(Ginger Oil Hair Growth) బాగా పనికి వస్తుంది. దీనిద్వారా జుట్టుకు అతిక మోతాదులో కెరాటిన్ లభిస్తుంది. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడవుగా(Hair Growth) పెరుగుతుంది. జింజర్ ఆయిల్ ఎలా వాడాలో చూద్దాం.

జింజర్ ఆయిల్ కొంచెం తీసుకోవాలి. అందులో కాస్త కొబ్బరి నూనె(Coconut Oil) కలిపి జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా పట్టించాలి. తర్వాత 30 నిమిషాలు అలానే ఉంచాలి. ఇక తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయాలి. జింజర్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు(Ginger Oil For Hair Growth) ఉపయోగపడుతుంది. జుట్టుకు పోషణను అందిస్తుంది. దీంతోపాటుగా మంచి ఆహారాలు కూడా తీసుకోవాలి. పుచ్చకాయ గింజలు, పప్పులు, వేరుశనగలు, సోయా, పనీర్, బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్.. లాంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిద్వారా పోషకాలు లభిస్తాయి. జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

అనేక కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. కొందరికి మానసిక ఒత్తిడి(Mental Stress) వల్ల వస్తుంది. వాయు కాలుష్యం, పౌష్టికాహారం లేకపోవడం, హార్మోన్లలో మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు(Health Problems), జుట్టు సంరక్షణ పట్ల శ్రద్ధ లేకపోవడం మొదలైనవి జుట్టు సమస్యలకు కారణమవుతాయి. ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

WhatsApp channel