Hair | జుట్టు సమస్యలతో ఇబ్బందిపడుతున్నారా? ఈ 5 ఆయుర్వేద చిట్కాలతో అన్నీ దూరం-effective ayurvedic tips to make your hair flawless ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hair | జుట్టు సమస్యలతో ఇబ్బందిపడుతున్నారా? ఈ 5 ఆయుర్వేద చిట్కాలతో అన్నీ దూరం

Hair | జుట్టు సమస్యలతో ఇబ్బందిపడుతున్నారా? ఈ 5 ఆయుర్వేద చిట్కాలతో అన్నీ దూరం

Feb 21, 2022, 04:18 PM IST HT Telugu Desk
Feb 21, 2022, 04:18 PM , IST

  • మీరు జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు లేదా జుట్టు నిర్జీవంగా మారడం మొదలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటన్నింటినీ దూరం చేసి, జుట్టుకు పునరుజ్జీవం కల్పించే కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను డాక్టర్ దీక్షా భావ్సార్ అందిస్తున్నారు. అవేంటో చూడండి..

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. కోవిడ్ మహమ్మారి, డయాబెటిస్ మొదలగు ఒత్తిళ్ల వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక కారణం కావొచ్చు. మీకు ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా, అవన్నీ దూరమయ్యేలా ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్సార్ ఐదు అద్భుతమైన చిట్కాలు అందించారు. వాటితో మీ జుట్టు రాలడం ఆగడంతో పాటు జుట్టు మరింత షైనీగా, దృఢంగా మారుతుంది.

(1 / 6)

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. కోవిడ్ మహమ్మారి, డయాబెటిస్ మొదలగు ఒత్తిళ్ల వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక కారణం కావొచ్చు. మీకు ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా, అవన్నీ దూరమయ్యేలా ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్సార్ ఐదు అద్భుతమైన చిట్కాలు అందించారు. వాటితో మీ జుట్టు రాలడం ఆగడంతో పాటు జుట్టు మరింత షైనీగా, దృఢంగా మారుతుంది.(Shutterstock)

1. Nasya: నిద్రపోయే ముందు నాసికా రంధ్రాలలో 2-3 చుక్కల ఆవు నెయ్యి వేసుకోవాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ చిట్కాతో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో మీ జుట్టు నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాదు, మైగ్రేన్ లాంటి తలనొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

(2 / 6)

1. Nasya: నిద్రపోయే ముందు నాసికా రంధ్రాలలో 2-3 చుక్కల ఆవు నెయ్యి వేసుకోవాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ చిట్కాతో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో మీ జుట్టు నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాదు, మైగ్రేన్ లాంటి తలనొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.(Pinterest)

2. Regular Oiling: మీ జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం మరిచిపోవద్దు. నూనె పెట్టుకోవడం వలన కుదుళ్లకు సరైన పోషణ అందుతుంది. దీంతో బలంగా, పొడుగ్గా పెరుగుతుంది. రోజుకు 2-3 సార్లు నూనె రాయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.

(3 / 6)

2. Regular Oiling: మీ జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం మరిచిపోవద్దు. నూనె పెట్టుకోవడం వలన కుదుళ్లకు సరైన పోషణ అందుతుంది. దీంతో బలంగా, పొడుగ్గా పెరుగుతుంది. రోజుకు 2-3 సార్లు నూనె రాయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.(Pixabay)

3. Sleep: కమ్మని నిద్రకు మించిన వైద్యం మరొకటి ఉండదు. మీ శరీరానికి సరిపడినంత నిద్ర, విశ్రాంతి ఇస్తే అది మీ ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యానికి మంచిది.

(4 / 6)

3. Sleep: కమ్మని నిద్రకు మించిన వైద్యం మరొకటి ఉండదు. మీ శరీరానికి సరిపడినంత నిద్ర, విశ్రాంతి ఇస్తే అది మీ ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యానికి మంచిది.(Pixabay)

4. Intake of calcium: శరీరంలోని ఎముకలు, దంతాలు, గోళ్ల లాగే వెంట్రుకలు కూడా కాల్షియంతో తయారైనవేనని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మీ ఒంట్లో కాల్షియం లోపం ఏర్పడితే జుట్టు పెరగడం నిలిచిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. విటమిన్ డి, ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కాబట్టి ఈ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. బయోటిన్, విటమిన్ బి12, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు, పాలు మొదలగు ఆహార పదార్థాలు తీసుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.

(5 / 6)

4. Intake of calcium: శరీరంలోని ఎముకలు, దంతాలు, గోళ్ల లాగే వెంట్రుకలు కూడా కాల్షియంతో తయారైనవేనని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మీ ఒంట్లో కాల్షియం లోపం ఏర్పడితే జుట్టు పెరగడం నిలిచిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. విటమిన్ డి, ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కాబట్టి ఈ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. బయోటిన్, విటమిన్ బి12, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు, పాలు మొదలగు ఆహార పదార్థాలు తీసుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.(Pixabay)

5. Breathwork: శరీరంలో అన్ని కణాలకు పోషణ అందాలంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి. ఇందుకు శ్వాసక్రియ మెరుగ్గా ఉండాలి. యోగా, ప్రాణాయామాల ద్వారా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ఒక లోతైన శ్వాస ద్వారా శరీరంలో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) ఉత్పత్తిని తగ్గించవచ్చు, హార్మోన్ల సమతుల్యతను కాపాడవచ్చు. ఈ అంశాలన్నీ జుట్టుకు ఆరోగ్యకరమైనవే. కాబట్టి క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయాలి.

(6 / 6)

5. Breathwork: శరీరంలో అన్ని కణాలకు పోషణ అందాలంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి. ఇందుకు శ్వాసక్రియ మెరుగ్గా ఉండాలి. యోగా, ప్రాణాయామాల ద్వారా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ఒక లోతైన శ్వాస ద్వారా శరీరంలో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) ఉత్పత్తిని తగ్గించవచ్చు, హార్మోన్ల సమతుల్యతను కాపాడవచ్చు. ఈ అంశాలన్నీ జుట్టుకు ఆరోగ్యకరమైనవే. కాబట్టి క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయాలి.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు