Healthy Hair with Aloe vera Gel : కలబంద ప్రయోజనాలను ఇప్పుడిప్పుడే ప్రజలు ఎక్కువగా తెలుసుకుంటున్నారు. మెరిసే, ప్రకాశవంతమైన చర్మం కావాలనుకునేవాళ్లకు కలబంద మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అంతేకాకుండా జుట్టును బలోపేతం చేయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు తేమను పెంచుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అయితే జుట్టు పెరుగుదలకు కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తమ ఫలితాల కోసం వేటితో కలిపి ఈ జెల్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు చుద్దాం.
* సజీవ కలబంద మొక్క నుంచి ఒక ఆకును కోయండి.
* ఆకును నిలువుగా రెండు భాగాలుగా కత్తిరించిన తర్వాత ఆ జెల్‌ను స్పూన్ సహాయంతో తీసేయండి. ఇదే ప్యూర్ అలోవెరా జెల్.
కలబంద గుజ్జును నేరుగా తలకు ఉపయోగించవచ్చు. లేదా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే హెయిర్ మాస్క్‌లను తయారు చేయడానికి అనేక ఇతర పదార్థాలతో కలపవచ్చు.
సహజ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, వాల్యూమ్‌ను పెంచడానికి.. కలబందను ఆముదంతో కలపండి. ఒక కప్పు అలోవెరా జెల్ తీసుకుని దానికి రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలపండి. తలకు సమానంగా పట్టించండి. మీ హెయిర్‌ను కవర్ చేసి.. 2-3 గంటలపాటు అలాగే ఉంచండి. అనంతరం మీ జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేయండి.
కలబంద, ఉల్లిపాయ రసం కలిపి హెయిర్‌కు మాస్క్‌గా వేస్తే.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం స్కాల్ప్‌ను ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలకు అడ్డుపడే హెయిర్ ఫోలికల్స్‌ను క్లియర్ చేస్తుంది. అలాగే ఉల్లిపాయ రసంలో సల్ఫర్ గాఢత ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి ఊతం ఇస్తుంది. జుట్టు రాలడాన్ని మరింత అరికడుతుంది.
కలబంద, ఉల్లిపాయ రసం సమాన భాగాలుగా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు సమానంగా అప్లై చేసి 30-45 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూని ఉపయోగించి శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు చేయవచ్చు.
జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ ఆరోగ్యకరమైనది. జుట్టు రాలడాన్ని నిరోధించే కాటెచిన్‌లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీ జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రోటెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది. ఒక కప్పు కలబంద గుజ్జులో తాజాగా తయారుచేసిన గ్రీన్ టీ కలపండి. దానితో తలకు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై మృదువైన చేతులతో అప్లై చేయండి. 15-20 నిమిషాలు అప్లై చేసిన తర్వాత చల్లటి నీటితో దానిని శుభ్రం చేసుకోండి.
ఉసిరికాయ లేదా గూస్బెర్రీ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అకాలంగా వచ్చే బూడిదను నివారిస్తుంది. అలోవెరా జెల్‌తో ఉసిరి రసం లేదా పొడిని మిక్స్ చేసి మీ తలకు సమానంగా అప్లై చేయండి. ఇది ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు ఉండనివ్వండి. సాధారణ నీటితో తలను శుభ్రం చేసుకోండి. ఆరోగ్యకరమైన, భారీ జుట్టు కోసం ఈ రెమెడీని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.
సంబంధిత కథనం