flipkart bachat dhamaal sale: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. ఫోన్‌లపై భారీ డిసౌంట్స్!-flipkart big bachat dhamaal sale starts from 20th to 22nd may 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flipkart Bachat Dhamaal Sale: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. ఫోన్‌లపై భారీ డిసౌంట్స్!

flipkart bachat dhamaal sale: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. ఫోన్‌లపై భారీ డిసౌంట్స్!

HT Telugu Desk HT Telugu
May 21, 2022 07:39 PM IST

ఫ్లిప్‌కార్ట్ భారీ డిసౌంట్స్ సేల్‌ను ప్రారంభించింది. "బిగ్ బచత్ ధమాల్" ( Big Bachat Dhamaal Sale) పేరుతో ప్రారంభమైన ఈ సేల్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనుంది.

<p>flipkart big bachat dhamaal sale</p>
flipkart big bachat dhamaal sale

ప్రముఖ ఈ - కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) "బిగ్ బచత్ ధమాల్" ( Big Bachat Dhamaal Sale) పేరుతో భారీ డిస్కౌంట్ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో Motorola Edge 20 Fusion 5G, Moto G31, Poco M4 Pro, Vivo T1 5G వంటి అనేక ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. డిస్కౌంట్స్ మాత్రమే కాకుండా, కొన్ని మోడల్స్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ప్ కూడా అందుబాటులో ఉన్నాయి. మే 20 నుండి ప్రారంభమైన ఈ సేల్ మే 22 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్ , యాక్సెసరీలపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. టీవీలపై 70 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలంగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైల్ ఫోన్‌లపై లభించే ఆఫర్స్

ఈ మూడు రోజుల ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది

Motorola Phones: Motorola Edge 20 Fusion 5G ఈ సేల్‌లో రూ. 18,999కే లభిస్తోంది. గతేడాది విడుదల చేసిన ఈ ఫోన్‌ ధర రూ.21,499గా ఉంది. Moto G31 ఫోన్ రూ. 10,999లకు అందుబాటులో ఉండగా.. Moto G40 Fusion రూ.14,499కి లభిస్తోంది. గతేడాది ఈ ఫోన్‌ను రూ.17,999కి ధరతో విడుదల చేశారు.

Poco series : ఈ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో Poco C31 రూ. 7,499కి లభిస్తోంది.  Poco M4 Pro 4G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 12,999కి అందుబాటులో ఉంది. ఇది గతేడాది రూ.14,999 ప్రారంభ ధరతో విడుదలైంది.

Vivo T1 5G: Vivo T1 5G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 15,990కి అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ లాంచ్ అయింది.

టీవీ, ఫ్రిజ్‌లపై డిస్కౌంట్స్:

స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో, OnePlus, Xiaomi, Reality, ఇతర బ్రాండ్‌ల టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు ఉన్నాయి. ఇది కాకుండా, తక్కువ ధరలోనే ఫ్రిజ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇలా సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర మొబైల్ డివైజ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

మెుబైల్ యాక్సిరీస్‌పై  ఆఫర్లు

మొబైల్ కేబుల్స్ రూ. 99 నుండి లభిస్తుండగా.. ల్యాప్‌టాప్ యాక్సిసరీస్‌, మొబైల్ కవర్లు రూ. 99 నుండి రూ. 199 ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇక ట్రిమ్మర్స్  రూ. 399ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి.  మే 22 వరకు జరిగే ఈ సేల్‌లో మీరు 80% వరకు తగ్గింపుతో ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. 

Whats_app_banner

సంబంధిత కథనం