Shanmukh Jaswanth: డిటెక్టివ్ ఏజెంట్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. టీజర్ రిలీజ్-youtube star shanmukh jaswanth agent anand santosh teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shanmukh Jaswanth: డిటెక్టివ్ ఏజెంట్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. టీజర్ రిలీజ్

Shanmukh Jaswanth: డిటెక్టివ్ ఏజెంట్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. టీజర్ రిలీజ్

Maragani Govardhan HT Telugu
Jul 12, 2022 06:37 AM IST

ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ నటించిన తాజా వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. తాజాగా ఈ సిరీస్‌ టీజర్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ టీజర్‌ను విడుదల చేశారు.

<p>షణ్ముఖ్ జస్వంత్</p>
షణ్ముఖ్ జస్వంత్ (Twitter)

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్‌సిరీస్‌లతో యూత్‌లో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడు.. బిగ్‌బాస్ ఎంట్రీతో తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. బిగ్‌బాస్ ఐదో సీజన్ రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్.. ఆ షోలో సహచర కంటెస్టెంట్ సిరితో సాన్నిహిత్యం అతడి వ్యక్తిగత జీవితంపై కూడా పడింది. ఫలితంగా తన ప్రియురాలు దీప్తి సునయనతో విడిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టిన షన్నూ.. ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే సిరీస్‌ను చేస్తున్నాడు. తాజాగా ఈ వెబ్‌సిరీస్ టీజర్ విడుదలైంది.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సామాజిక మాధ్యమాల వేదికగా ఏజెంట్ ఆనంద్ సంతోష్ టీజర్‍‌ను విడుదల చేశారు. ఇందులో షణ్ముఖ్ స్టైలిష్‌గా కనిపించారు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావ్? నెలకు నీ జీతం ఎంత వస్తుంది? అసలు ఎంత ఖర్చవుతుంది? ఎంత మిగులుతుంది? అంటూ షణ్ముఖ్‌ను ఓ వ్యక్తి ప్రశ్నలు అడగడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ ప్రశ్నలకు షన్నూ తాను ఓ డిటెక్టివ్‌ ఏజెంట్‌ను అని చెప్పే సమాధానంతో, బీజీఎంతో వెబ్‌సిరీస్‌పై ఆసక్తి కలిగించారు.

మనస్సు తప్ప.. ఫిజికల్‌గా, లిక్విడ్‌గా ఏదైనా వెతికి పెడతా అని షన్నూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌కు అరుణ్ పవర్ దర్శకత్వం వహించగా.. సాఫ్ట్ వేర్ డెవలెపర్, సూర్య లాంటి వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించిన సుబ్బు.. ఈ సిరీస్‌కు స్క్రీప్టును అందించాడు. ఈ వెబ్‌సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. త్వరలో ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం