Ponting on Pant: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పంత్ ఆటను ప్రపంచం మిస్ అవుతుంది.. ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్
Ponting on Pant: ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. టీమిండియా వర్థమాన ఆటగాడు రిషబ్ పంత్ గురించి స్పందించాడు. వచ్చే నెల నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పంత్‌ను మిస్ అవుతామని స్పష్టం చేశాడు.
Ponting on Pant: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా భారత్‍లో పర్యటించనుంది. ఆసీస్‌తో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌లను ప్రకటించాయి. అయితే గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న డ్యాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవల ప్రమాదానికి గురికావడంతో అతడు ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడు కోలుకోవాలని క్రీడా సమాజం నుంచి స్పందనలు వచ్చాయి. తాజాగా పంత్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పంత్‌ను మిస్సవుతామని స్పష్టం చేశారు.
"ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో పంత్ లేకపోవడం బాధాకరం. చివరగా ఆసీస్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో అతడు ఎలా ఆడాడో మాకు తెలుసు. ఈ సిరీస్ కోసం అతడు ఆత్రుతగా చూశాడు. మిగతా ప్రపంచం పంత్ ఆటను చూసేందుకు ఎదురుచూసింది." అని రికీ పాంటింగ్ చెప్పినట్లు ఐసీసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మొదట్లో పంత్ టెస్టులో కంటే టీ20ల్లోనే బాగా రాణిస్తాడని తాము భావించినట్లు పాంటింగ్ తెలిపాడు.
“పంత్ కెరీర్ ప్రారంభంలో మేము అతడు మెరుగైన టీ20, వన్డే బ్యాటర్ అవుతాడని అనుకున్నాం. టెస్టుల్లో కంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే రాణిస్తాడనుకున్నాం. కానీ ఇందుకు విరుద్ధంగా జరిగింది. అతడు టెస్టు క్రికెట్ సామర్థ్యం అద్భుతం.” అని పాంటింగ్ తెలిపాడు.
డిసెంబర్ 30న పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే అతన్ని డిశ్చార్జ్ చేయనున్నారు. పంత్ తో తాను మాట్లాడానని, త్వరలోనే అతడు తిరిగి ఫీల్డ్ లోకి వస్తాడన్న ఆశాభావం పాంటింగ్ వ్యక్తం చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్