Ori Devuda Trailer Released: విశ్వక్ సేన్ ఓరి దేవుడా ట్రైలర్ విడుదల.. ఫ్రెండే వైఫ్ అయితే.. బ్యాండ్ బాజానే..!
Ori Devuda Trailer: విశ్వక్ సేన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన చిత్రం ఓరి దేవుడా. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అక్టోబరు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Ori Devuda Trailer Released: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. నటుడిగానే కాకుండా ఇప్పటికే దర్శకుడిగా, నిర్మాతగా తనలో పలు కోణాలను చూపించాడు. ఈ ఏడాది ఇప్పటికే అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యువ హీరో.. మరోసారి వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ఓరి దేవుడా చిత్రం. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ఓమై కడువలే చిత్రానికి అఫిషియల్ రీమేక్. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ గమనిస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విశ్వక్ సేన్ యాక్టింగ్, వెంకటేశ్ కామెడీ టైమింగ్ అదిరిపోయాయి. ట్రైలర్ చివర్లో వైఫ్‌లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండే వైఫ్‌లా వచ్చిందనుకో అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్‌కు ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌తోనే చిత్రబృందం సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను జోడించి ఆసక్తికరంగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లయిన తర్వాత అపార్థాల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే వీళ్లు విడిపోవడానికి కారమం ఏంటి? వీళ్ల సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. లైఫ్ మనకు ఇంకొక ఛాన్స్ ఇశ్తే.. గంతలో మనం తీసుకున్న నిర్ణయాలను మార్చితే జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. అక్టోబరు 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
తమిళంలో ఓ మై కడువలై తెరకెక్కించిన అశ్వత్ మారి ముత్తునే తెలుగులోనూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వెంకటేశ్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. రొమాంటింక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించింది. లియాన్ జేమ్స్ సంగీతం అందించగా.. పీవీపీ సినిమాస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
సంబంధిత కథనం