Vishal clarity on Politics: వైఎస్ జగన్ అంటే ఇష్టం.. రాజకీయ అరంగేట్రంపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు-vishal clarifies his political entry in kuppam andhra pradesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishal Clarity On Politics: వైఎస్ జగన్ అంటే ఇష్టం.. రాజకీయ అరంగేట్రంపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vishal clarity on Politics: వైఎస్ జగన్ అంటే ఇష్టం.. రాజకీయ అరంగేట్రంపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Dec 20, 2022 11:20 AM IST

Vishal clarity on Politics: కోలీవుడ్ హీరో విశాల్ తన లాఠీ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతికి వచ్చారు. ఇందులో భాగంగా తనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఇష్టమని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజకీయాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విశాల్
విశాల్

Vishal clarity on Politics: కోలీవుడ్‌లో మంచి పాపులారిటీని తెచ్చుకున్న తెలుగు హీరో విశాల్. పందెంకోడి, అభిమన్యు, సెల్యూట్ తదితర చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నారు. అతడు హీరోగా నటించిన తాజా చిత్రం లాఠీ. ఈ సినిమాను డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతి వెళ్లిన అతడు తను రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అంశంపై మాట్లాడారు.

తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న విశాల్.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తెలుగులో మీకు ఏ రాజకీయ నాయకుడంటే ఇష్టమని చెప్పగా.. తనకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే ఇష్టమని స్పష్టం చేశారు. అంతేకాకుండా కుప్పంలో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు కూడా తనకు ఆసక్తి లేదని సమాధానమిచ్చారు.

"నాకు సీఎం జగన్ అంటే ఇష్టం. అయినా కూడా నేను కుప్పంలో పోటీ చేయను. మాకు కుప్పంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. కుప్పంలో ప్రతిదీ నాకు తెలుసు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు. నేను సినిమా హీరోగా ఎమ్మెల్యేల కంటే ఎక్కవ సంపాదిస్తున్నాను. ప్రజా సేవ చేయాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కావాల్సిన పని లేదు. ఎలాగైనా మంచి చేయవచ్చు." అని విశాల్ తెలిపారు. దీంతో విశాల్ రాజకీయ అరంగేట్రంపై అనుమానాలు పటాపంచలయ్యాయి. వైఎస్‌ఆర్సీపీ నుంచి ఆయనకు సీట్ ఇస్తారనే వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

విశాల్ నటిస్తున్న లాఠీ సినిమా డిసెంబరు 22న విడుదల కానుంది. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నందా దురై రాజు ఈ సినిమాను నిర్మించారు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా చేసింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం