Virata Parvam: ఏపీ, తెలంగాణలో విరాటపర్వం సినిమా టికెట్ల ధరలు ఎంతంటే…-virataparvam movie ticket prices in ap and telangana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virata Parvam: ఏపీ, తెలంగాణలో విరాటపర్వం సినిమా టికెట్ల ధరలు ఎంతంటే…

Virata Parvam: ఏపీ, తెలంగాణలో విరాటపర్వం సినిమా టికెట్ల ధరలు ఎంతంటే…

Nelki Naresh Kumar HT Telugu
Jun 16, 2022 09:29 AM IST

జూన్ నెల‌లో విడుద‌ల‌కానున్న పెద్ద సినిమాల్లో విరాట‌ప‌ర్వం ఒక‌టి. 1990 ద‌శ‌కం నాటి క‌థాంశంతో న‌క్స‌లిజానికి ప్రేమ‌క‌థ‌ను జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమాలో రానా,సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రేపు(జూన్ 17న‌) ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏపీ,తెలంగాణ ఈ సినిమా టికెట్ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే...

<p>సాయిప‌ల్ల‌వి</p>
సాయిప‌ల్ల‌వి (twitter)

టికెట్ల ధరల విషయంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆచితూచిఅడుగులు వేస్తున్నారు.ఇటీవ‌ల కాలంలో టికెట్ల రేట్లు పెంచడంతో స‌గ‌టు సినీ అభిమానులపై భారం పెరిగింది. ధ‌ర‌ల‌కు భయపడి థియేటర్ల కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య నానాటికి తగ్గుతుందని ఎగ్జిబిట‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో నెల రోజుల్లోనే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో కూడా థియేటర్ల వసూళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని అంటున్నారు. ఈ సవాళ్లనుఅధిగమించేందుకు దర్శకనిర్మాతలు ఒక్కొక్కరుగా తమ సినిమాల టికెట్ల ధరలను తగ్గిస్తున్నారు.

తొలి రోజు నుంచే తగ్గింపు ధరలతో తమ సినిమాల్ని ప్రదర్శిస్తున్నామని ప్రకటిస్తున్నారు. విరాటపర్వం కూడా ఇదే బాటలో అడుగులు వేయబోతున్నది. జూన్ నెలలో విడుదలవుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి.రానా,సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. వరంగల్ కు చెందిన తూము సరళ అనే మహిళా నక్సలైట్ జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ 1990 దశకంలో తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

జూన్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా టికెట్ల ధరలను చిత్ర యూనిట్ తగ్గించింది. తెలంగాణలోసింగిల్ స్ర్కీన్స్ లో 150,మల్టీప్లెక్స్ లలో 200లుగా టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించింది. ఏపీలో సింగిల్ స్ర్కీన్స్‌లో 147, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 177గా పేర్కొన్నారు. జీఎస్‌టీ క‌లుపుకొని ఈ ధ‌ర‌ల‌తో సినిమాను ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇటీవ‌ల కాలంగా మేజ‌ర్‌తో పలు సినిమాల టికెట్ల ధరలను తగ్గించారు.

అలాగే జూలై 1న రానున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూస‌ర్స్ సైతం టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లుగా ఇప్పటికే వెల్లడించారు. ప్రేక్ష‌కుల్ని తిరిగి థియేట‌ర్ల‌కు అల‌వాటు ప‌డేలా చేయాలంటే రేట్ల‌ను త‌గ్గించ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌నే అభిప్రాయం సినీ వర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. కాగా విరాట‌ప‌ర్వం చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం