Kushi Trailer: “భర్త అంటే ఎలా ఉండాలో సమాజానికి చూపిస్తా”: ఖుషి ట్రైలర్ వచ్చేసింది-vijay deverakonda samantha love romantic movie kushi trailer released check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi Trailer: “భర్త అంటే ఎలా ఉండాలో సమాజానికి చూపిస్తా”: ఖుషి ట్రైలర్ వచ్చేసింది

Kushi Trailer: “భర్త అంటే ఎలా ఉండాలో సమాజానికి చూపిస్తా”: ఖుషి ట్రైలర్ వచ్చేసింది

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 09, 2023 04:08 PM IST

Kushi Trailer: ఖుషి సినిమా ట్రైలర్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ, సమంత మధ్య లవ్ ట్రాక్, పెళ్లి, గొడవలు, ఎమోషన్లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

Kushi Trailer: “భర్త అంటే ఎలా ఉండాలో సమాజానికి చూపిస్తా”: ఖుషి ట్రైలర్ వచ్చేసింది
Kushi Trailer: “భర్త అంటే ఎలా ఉండాలో సమాజానికి చూపిస్తా”: ఖుషి ట్రైలర్ వచ్చేసింది

Kushi Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్‍లో వస్తున్న ‘ఖుషి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఖుషి నుంచి వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన స్వరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్‍కు ముందు ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్‍ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ నేడు (ఆగస్టు 9) విడుదలైంది. ట్రైలర్ ఎలా ఉందంటే..

ఖుషి ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్లో విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా ఉంది. లవ్, రొమాన్స్, పెళ్లి, గొడవలు, ఎమోషన్లతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. “దీనమ్మ కశ్మీర్.. సేమ్ రోజా సినిమాలాగే ఉంది” అని విప్లవ్ (విజయ్ దేవరకొండ) చెప్పే డైలాగ్‍లో ఖుషి మూవీ ట్రైలర్ మొదలైంది. ముందుగా కశ్మీర్‌లో ముస్లింగా ఆరాధ్య (సమంత) పరిచయం అవుతుంది. ఆమెను విప్లవ్ ప్రేమిస్తాడు. ఆమె కూడా ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత "నేను బేగం కాదు.. బ్రాహ్మిణ్” అని విప్లవ్‍కు చెబుతుంది ఆరాధ్య. ఆ తర్వాత విప్లవ్, ఆరాధ్య (సమంత) లవ్ చేసుకోవడం, కుటుంబాలు ఒప్పుకోకపోవడం, వారిద్దరూ బయటికి పెళ్లి చేసుకోవడం, వారి మధ్య గొడవలు జరగడం, ఎమోషన్ సీన్లు ట్రైలర్‌లో ఉన్నాయి. విప్లవ్, ఆరాధ్య మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అపార్థాలు చేసుకుంటుంటారు. “పెళ్లంటేనే చావురా.. నువ్వెప్పుడో చచ్చిపోయావు” అని రాహుల్ రామకృష్ణ డైలాగ్ ఉంది. “అసలు భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా” అని విప్లవ్ (విజయ్ దేవరకొండ) డైలాగ్ చెబుతాడు. “మార్కెట్లో అలా అనుకుంటున్నారు కానీ.. నేను స్త్రీ పక్షపాతిని” అనే డైలాగ్‍తో ఖుషి ట్రైలర్ ముగిసింది. డైరెక్టర్ శివ నిర్వాణ మార్క్ ఫీల్‍గుడ్, ఎమోషనల్ మూవీగా ఖుషి ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం హృద్యంగా ఉంది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఖుషి మూవీ ట్రైలర్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్స్ చేయగా.. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ తదితరులు అయ్యంగార్ కీలకపాత్రలు పోషించారు. శివ నిర్వాణ.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Whats_app_banner