Bichagadu 2 Success Meet: బిచ్చగాడు 2 సక్సెస్‌పై విజయ్ ఆంటోనీ ఆనందం.. గుడ్ న్యూస్ చెప్పిన హీరో-vijay antony hints on bichagadu 3 in bichagadu 2 success meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bichagadu 2 Success Meet: బిచ్చగాడు 2 సక్సెస్‌పై విజయ్ ఆంటోనీ ఆనందం.. గుడ్ న్యూస్ చెప్పిన హీరో

Bichagadu 2 Success Meet: బిచ్చగాడు 2 సక్సెస్‌పై విజయ్ ఆంటోనీ ఆనందం.. గుడ్ న్యూస్ చెప్పిన హీరో

Maragani Govardhan HT Telugu
May 28, 2023 06:12 PM IST

Bichagadu 2 Success Meet: బిచ్చగాడు 2 మూవీ విజయంపై విజయ్ ఆంటోనీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మూవీ సక్సెస్ మీట్‌లో భాగంగా మాట్లాడిన ఆయన బిచ్చగాడు 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు.

విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ

Bichagadu 2 Success Meet: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు-2 ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 2016లో విడుదలైన బిచ్చగాడుకు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీపై విపరీతంగా బజ్ ఏర్పడటంతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో థియేటర్లకు వెళ్లి మరి చిత్రబృందం సందడి చేసింది. అలాగే రాజమండ్రి నిజమైన బిచ్చగాళ్లకు కొంతమందికి స్టార్ హోటెల్‌లో విందు కూడా ఏర్పాటు చేశారు. తెలుగులో ప్రేక్షకులు ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు గాను సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. "మీ అందరికీ బిచ్చగాడు నచ్చింది. ఆ మూవీకి ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పుడు బిచ్చగాడు-2కు కూడా అంతే విజయాన్ని అందించారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. బిజీ షెడ్యూల్ కారణంగా కుదరడం లేదు. ఈ సారి వచ్చినప్పుడు తప్పకుండా తెలుగులోనే మాట్లాడతాను. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి దోహదపడిన నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు చెబుతున్నాను." అని విజయ్ అన్నారు.

బిచ్చగాడు-3 రాబోతుందని విజయ్ ఆంటోనీ హింట్ ఇచ్చారు.

"ఈ సందర్భంగా మీకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. త్వరలో బిచ్చగాడు 3 మూవీ చేయబోతున్నాను. 2025 లేదా 2026 ప్రారంభంలో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు.. నా టీమ్ మొత్తానికి చెందుతుంది. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇల్లు కొంటాను. నా సినిమాల షూటింగ్స్ కూడా ఆంధ్ర, తెలంగాణలో షూటింగ్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను." అని విజయ్ ఆంటోనీ స్పష్టం చేశారు.

ఈ సినిమాలో కావ్య థాపర్, రాధా రావి, హరీష్ పెరడి, దేవ్ గిల్, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై ఆయనే నిర్మాతగానూ వ్యవహరించారు. అంతేకాకుండా స్వీయ దర్శకత్వం వహించారు. మే 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృక తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుదలైంది.

IPL_Entry_Point

టాపిక్