Vijay Antony Hatya Release Date: విజయ్ ఆంటోనీ హత్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్-vijay antony hatya movie release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Antony Hatya Release Date: విజయ్ ఆంటోనీ హత్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay Antony Hatya Release Date: విజయ్ ఆంటోనీ హత్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Hari Prasad S HT Telugu
Jun 28, 2023 01:13 PM IST

Vijay Antony Hatya Release Date: విజయ్ ఆంటోనీ హత్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. బిచ్చగాడు 2తో ఈ మధ్యే విజయ్ మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

హత్య మూవీలో విజయ్ ఆంటోనీ
హత్య మూవీలో విజయ్ ఆంటోనీ

Vijay Antony Hatya Release Date: తమిళ స్టార్ నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అతడు నటించిన బిచ్చగాడు, బిచ్చగాడు 2 మూవీస్ తెలుగులోనూ మంచి హిట్ అందుకున్నాయి. దీంతో అతనికి సంబంధించిన కొత్త మూవీస్ కూడా ఇక్కడ క్రేజ్ ఏర్పడింది. ఇక తాజాగా విజయ్ నటించిన హత్య మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ హత్య (తమిళంలో కొలాయ్) మూవీని జులై 21న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. బాలాజీ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ హత్య మూవీ ఓ గదిలో జరిగిన మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ కొత్త పోస్టర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీతోపాటు రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాధిక శరత్ కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా హత్య మూవీని నిర్మించాయి. గిరీష్ మ్యూజిక్ అందించాడు. ఇక ఇదే కాకుండా విజయ్ ఆంటోనీ నటించిన మరో మూవీ విక్రమ్ రాథోడ్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు.

ముఖం నిండా గాయాల‌తో సీరియ‌స్ లుక్‌లో విజ‌య్ ఆంటోనీ క‌నిపించాడు. త‌మిళంలో ఈ ఏడాది రిలీజైన త‌మిళ‌రాస‌న్ మూవీకి అనువాదంగా విక్ర‌మ్ రాథోడ్ మూవీ తెర‌కెక్కుతోంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విక్ర‌మార్కుడు సినిమాలో ర‌వితేజ విక్ర‌మ్ రాథోడ్ అనే పోలీస్ పాత్ర‌లో న‌టించాడు. పాపుల‌ర్‌గా మారిన ఆ క్యారెక్ట‌ర్ పేరును విజ‌య్ ఆంటోనీ మూవీకి టైటిల్‌గా పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన విక్ర‌మ్ రాథోడ్ సినిమాకు బాబు యోగిశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగులో ఈ సినిమాను రావూరి వెంక‌ట‌స్వామి, కౌస‌ల్య‌రాణి నిర్మిస్తోన్నారు. ఈ సినిమాలో సోనూసూద్‌, సురేష్ గోపి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళంలో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఇందులో విజ‌య్ ఆంటోనీ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించాడు. ఈ సినిమాకు ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించ‌డం గ‌మ‌నార్హం.

IPL_Entry_Point

టాపిక్