Valentines Day Special Tollywood Love Stories: తెలుగు సినిమాల్లో ప్రేమ అప్పుడు - ఇప్పుడు
Valentines Day Special Tollywood Love Stories: సినిమాల్లో కాలం మారుతోన్న అవుడ్‌డేటెడ్ కానీ జోనర్ లవ్ స్టోరీ మాత్రమే. ప్రేమ మారకపోయినా ఆ ఎమోషన్‌ను సిల్వర్‌స్క్రీన్‌పై ఆవిష్కరించే విధానం మాత్రం మారుతోంది. సినిమాల్లో ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే...
Valentines Day Special Tollywood Love Stories: సినీ పరిశ్రమలో లవ్ స్టోరీస్ ఎవర్‌గ్రీన్. ప్రేమ లేని సినిమా అంటూ కనిపించదు. సినిమా కథ ఏదైనా దానిని నడిపించే సాధనం మాత్రం ప్రేమగానే చూపిస్తుంటారు. సినీ పరిశ్రమలో అవుడ్‌డేట్ కానీ ఒకే ఒక జోనర్ ప్రేమ మాత్రమే.
ప్రేమను భిన్న కోణాలలో దర్శకులు తెరపై ఆవిష్కరించారు దర్శకులు. అయినా ఈ ప్రేమకథల్లో చెప్పాల్సిన ఏదో ఒక కొత్త పాయింట్ మిగిలే ఉంటుంది. ప్రేమ అనే ఎమోషన్ సినిమాల్లో కామన్ అయిన దానిని వ్యక్తం చేసే విధాన మాత్రం మారుతోంది. చూపులతో మొదలైన ప్రేమకథలు ఇప్పుడు లిప్‌లాక్‌ల వరకు వెళ్లిపోయాయన్నది ఓ వాదన.
హద్దులు దాటడం అరుదు...
ఇదివరకు ప్రేమకథలు సెన్సిబుల్‌గా ఉండేవని కొందరి అభిప్రాయం. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను అసభ్యతకు తావు లేకుండా అందంగా దర్శకులు చూపించేవారనే వాదన వినిపిస్తుంటుంది. చూపులు, మాటలతోనే నాయకానాయికల మధ్య ఉన్న ప్రేమను ఆవిష్కరించేవారు. అంతకుమించి హద్దులు దాటడం అరుదుగానే జరిగేది.
సీతాకోకచిలుక, మరోచరిత్ర, గీతాంజలి ఇలా ఎన్నో గొప్ప ప్రేమకథ సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సినిమాల్లో నాయకానాయికల మధ్య ప్రేమను పొయేటివ్ వేలో స్వచ్ఛంగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు ఆయా దర్శకులు.
ముద్దు సన్నివేశాలు చూపించాల్సివస్తే చెట్టులను, పువ్వులను అడ్డుపెట్టి దర్శకులు తమ క్రియేటివిటీని చాటుకునేవారు.నాయకానాయికల ప్రేమను బోల్డ్‌గా చూపిస్తే తమ సినిమాలకు ఎక్కడ ఫ్యామిలీ ప్రేక్షకులు దూరమవుతారోననే భయం దర్శకనిర్మాత్లలో ఉండేది.
ట్రెండ్ మారింది...
అలాంటి సెన్సిబుల్ ప్రేమలకు ఇప్పుడు కాలం చెల్లిందనేది కొందరి అభిప్రాయం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని రియలిస్టిక్‌గా బోల్డ్‌గా ప్రేమకథల్ని తెరపై చూపిస్తున్నారు. ఎలాంటి హద్దులు లేకుండా ప్రేమ వ్యక్తీకరణను సహజంగా చూపించడమే ట్రెండ్‌గా మారింది.
ప్రేమ పట్ల తమకున్న ఫీలింగ్స్‌ను ఓపెన్‌గా వ్యక్తం చేయడమే ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. అర్జున్‌రెడ్డి లాంటి సినిమాలే అందుకు ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ప్రేమ రూపురేఖలు, భాషలు మొత్తం మారిపోతున్నాయి. నేటితరం యువత ఆలోచనల్ని, వ్యక్తిత్వాల్ని ప్రేమకథల్లో చూపిస్తున్నారు దర్శకులు.
మూగ ఆరాధన...
గతంలో మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకుండా నాయకానాయికలు మూగగా ఆరాధించే కథాంశాలతో చాలా సినిమాలొచ్చాయి. ఆరాధన, హృదయం లాంటి సినిమాలు అలాంటి కథాంశాలతోనే ప్రేక్షకుల్ని మెప్పించాయి.
శుభం కార్డు వరకు తమ ప్రేమను వ్యక్తం చేయలేక ప్రేమించిన వారిని మర్చిపోలేక విషాదంగా నాయకానాయికల ప్రేమకథలను ముగించినట్లుగా చూపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రేమలో విఫలమైనా మళ్లీ కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టవచ్చుననే ట్రెండ్ పెరిగిపోయింది. ప్రేమకు బ్రేకప్ అనేది ఉండదు అని చూపిస్తున్నారు.
ఈగో ఇష్యూస్
గత సినిమాల్లో హీరో హీరోయిన్ల ప్రేమకు కులమత, ఆస్తి అంతరాలు ఎదురయ్యేవి. తల్లిదండ్రులను విలన్స్‌గా చూపించేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. ప్రేమకథల్లో ఈగో ఇష్యూస్, మనస్తత్వాలు, కారణంగా చూపిస్తూ సినిమాల్ని తెరకెక్కిస్తోన్నారు.