Umapathi Movie Review: ఉమాప‌తి రివ్యూ - అవికాగోర్ ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ ఎలా ఉందంటే?-umapathi movie review avika gor anurag village love entertainer movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Umapathi Movie Review: ఉమాప‌తి రివ్యూ - అవికాగోర్ ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ ఎలా ఉందంటే?

Umapathi Movie Review: ఉమాప‌తి రివ్యూ - అవికాగోర్ ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Dec 29, 2023 07:48 PM IST

Umapathi Movie Review: అనురాగ్‌, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా ఉమాప‌తి మూవీ శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 29న‌) థియేట‌ర్ల‌లో రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు స‌త్య ద్వారపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అనురాగ్‌, అవికాగోర్
అనురాగ్‌, అవికాగోర్

Umapathi Movie Review: చాలా రోజుల త‌ర్వాత ప‌ల్లెటూరి క‌థ‌తో అవికాగోర్ న‌టించిన తాజా చిత్రం ఉమాప‌తి శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అనురాగ్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు స‌త్య ద్వార‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?

ఉమ ప్రేమ‌క‌థ‌...

కొత్త‌ప‌ల్లికి చెందిన వ‌ర (అనురాగ్‌) ఎలాంటి బ‌రువు బాధ్య‌త‌లు లేకుండా జాలాయిగా తిరుగుతుంటాడు. అల్ల‌రి ప‌నుల‌తో ఎప్పుడూ తండ్రితో తిట్లు తింటుంటాడు. అత‌డి జీవితంలోకి అనుకోకుండా దోస‌కాయ‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఉమ(అవికా గోర్‌) వ‌స్తుంది.

ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు వ‌ర‌. కానీ గుడి విష‌యంలో రెండు ఊళ్ల మ‌ధ్య ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగా ఉమ, వ‌ర ప్రేమ‌, పెళ్లికి ఆమె అన్న‌య్య అడ్డు చెబుతాడు. రెండు ఊళ్ల వాళ్లు కూడా వారి ప్రేమ‌ను వ్య‌తిరేకిస్తారు. ఈ గొడ‌వ‌ల‌ను దాటుకొని ఉమ, వ‌ర ఒక్క‌ట‌య్యారా? అస‌లు ఊళ్లో గొడ‌వ‌ల‌కు కార‌ణం ఏమిటి? త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి ఉమ అన్న‌య్య‌ను ఎదురించి వ‌ర ఎలాంటి పోరాటం చేశాడు అన్న‌దే ఉమాప‌తి మూవీ క‌థ‌.

ప‌క్కా ప‌ల్లెటూరి మూవీ...

ఉమాప‌తి ప‌క్కా ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు కామెడీ, యాక్ష‌న్ అంశాల‌ క‌ల‌బోత‌గా ద‌ర్శ‌కుడు స‌త్య ద్వారపూడి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. క‌థ రొటీన్ అయినా విలేజ్ నేటివిటీ కార‌ణంగా ఫ్రెష్‌నెస్ వ‌చ్చింది.

హీరోహీరోయిన్ల ల‌వ్ స్టోరీని చాలా రియ‌లిస్టిక్‌గా స్క్రీన్‌పై ఆవిష్క‌రించాడు. సెంటిమెంట్‌, మెలోడ్రామా జోలికి పోకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు న‌వ్వించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు. త‌ల్లికొడుకుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ను కూడా వినోదాత్మ‌క పంథాలోనే చూపించారు.

విరామంలో ట్విస్ట్‌...

ఉమాప‌తి ఫ‌స్ట్ హాఫ్ మొత్తం హీరో, అత‌డి ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే అల్ల‌రి ప‌నుల‌తో స‌ర‌దాగా సాగుతుంది. ఏదో ఒక త‌ప్పు ప‌నిచేస్తూ వ‌ర త‌న తండ్రికి దొరికిపోయి తిట్లు తిన‌డం, పంచాయితీ పెద్ద పోసాని కృష్ణ‌ముర‌ళితో గొడ‌వ‌ల‌తో డైరెక్ట‌ర్ టైమ్‌పాస్ చేశాడు. విరామంలోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

ఊళ్ల మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ ఓ ట్విస్ట్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్ట‌ర్‌. ఉమ ప్రేమ‌ను వ్య‌తిరేకించిన ఆమె అన్న‌య్య వ‌ర‌పై ప‌గ‌తో ర‌గిలిపోతూ అత‌డిని చంప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం...వారిద్ద‌రి మ‌ధ్య ఇదివ‌ర‌కే గొడ‌వ‌లు ఉన్న‌ట్లుగా చూపించే ట్విస్ట్‌ల‌తో యాక్ష‌న్‌, ఎమోష‌న్స్‌తో సెకండాఫ్ సాగుతుంది.

ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ‌ల‌తో...

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు తెర‌పై చాలా సినిమాలొచ్చాయి. వాటి ఛాయ‌ల‌తోనే ఈసినిమా సాగుతుంది. సినిమాలో ఉన్న ఒక‌టి రెండు ట్విస్ట్‌ల‌ను కూడా కొత్త‌గా రాసుకుంటే బాగుండేది. ఫ‌స్ట్ హాఫ్‌లో అస‌లు క‌థంటూ లేకుండా సాగ‌డం కూడా మైన‌స్‌గా అనిపిస్తుంది.

అవికాగోర్ హైలైట్‌...

ఉమ‌గా అవికాగోర్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. చాలా రోజుల త‌ర్వాత పూర్తిస్థాయి ప‌ల్లెటూరి అమ్మాయి అవికాగోర్ న‌టించిన సినిమా ఇది. ఈ పాత్ర‌లో ఆమె లుక్‌, యాక్టింగ్ బాగున్నాయి. హీరో అనురాగ్‌కు ఇదే తొలి సినిమా. కామెడీ ప‌రంగా ఓకే అనిపించాడు.

కానీ ఎమోష‌న‌ల్ సీన్స్‌లో కొంత త‌డ‌బ‌డ్డాడు. హీరో త‌ల్లిదండ్రులుగా శివ‌న్నారాయ‌ణ‌, తుల‌సి త‌మ కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. పంచాయితీ పెద్ద‌గా పోసాని కృష్ణ‌ముర‌ళి, హీరో స్నేహితులుగా ప్ర‌వీణ్‌, ఆటో రాంప్ర‌సాద్ పంచ్‌ల్లో కొన్ని మాత్ర‌మే పేలాయి.

టైమ్‌పాస్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

ఉమాప‌తి టైమ్‌పాస్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌థ‌, క‌థ‌నాలు రొటీన్ సినిమాకు మైన‌స్‌. కానీ కామెడీని ఆశించి చూస్తే మాత్రం డిస‌పాయింట్ చేయ‌దు.

రేటింగ్‌: 2.5/ 5

IPL_Entry_Point