Ugram Twitter Review: ఉగ్రం ట్విట్ట‌ర్ రివ్యూ - అల్ల‌రి న‌రేష్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే-ugram movie twitter review and overseas premieres talk ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ugram Twitter Review: ఉగ్రం ట్విట్ట‌ర్ రివ్యూ - అల్ల‌రి న‌రేష్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే

Ugram Twitter Review: ఉగ్రం ట్విట్ట‌ర్ రివ్యూ - అల్ల‌రి న‌రేష్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే

HT Telugu Desk HT Telugu
May 05, 2023 07:11 AM IST

Ugram Twitter Review: అల్ల‌రి న‌రేష్ హీరోగా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఉగ్రం సినిమా శుక్ర‌వారం (నేడు) థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే...

అల్ల‌రి న‌రేష్
అల్ల‌రి న‌రేష్

Ugram Twitter Review: అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఉగ్రం సినిమా ఈ శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. నాంది స‌క్సెస్ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్‌, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ఇది.

ఉగ్రం ట్రైల‌ర్స్‌, టీజ‌ర్స్‌లో గ‌త సినిమాల‌కు భిన్నంగా పోలీస్ ఆఫీస‌ర్‌గా సీరియ‌ల్ రోల్‌లో అల్ల‌రి న‌రేష్ క‌నిపించ‌డంతో ఈ సినిమా ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. ఉగ్రం సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉంది? నాంది త‌ర్వాత అల్ల‌రి న‌రేష్‌కు ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల మ‌రో విజ‌యాన్ని అందించాడా? లేదా? అన్న‌ది చూద్ధాం...

యాక్సిడెంట్ సీన్‌తో...

మిస్సింగ్ కేసుల నేప‌థ్యంలో సీరియ‌స్ ఇష్యూకి హీరోయిజం, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మేళ‌వించి మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఉగ్రం సినిమాను తెర‌కెక్కించిన‌ట్లుగా చెబుతోన్నారు. న‌రేష్‌తో పాటు అత‌డి కుటుంబానికి యాక్సిడెంట్ అయ్యే సీన్‌తో ఈ సినిమా ఉత్కంఠ‌గా ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఓవ‌ర్‌సీస్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

ఆ త‌ర్వాతనీతి, నిజాయితీల‌తో ప‌నిచేసే శివ‌కుమార్ అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌రేష్ ప‌రిచ‌య‌మ్యే సీన్స్‌, అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను బాగున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఫ‌స్ట్‌లో క‌థ కంటే హీరోయిజం, ల‌వ్ ట్రాక్‌కే ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇచ్చిన‌ట్లుగా ట్వీట్స్ చేస్తున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ కొద్దిగా ఇబ్బందిపెడ‌తాయ‌నే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. న‌రేష్ మిర్నా మీన‌న్ ల‌వ్ ట్రాక్ పూర్తిగా బోరింగ్‌గా సాగుతుంద‌ని అంటున్నారు.

ట్విస్ట్‌లు హైలైట్‌...

సెకండాఫ్‌లోనే ద‌ర్శ‌కుడు అస‌లైన క‌థ‌లోని వెళ్లాడ‌ని అంటున్నారు. మిస్సింగ్ కేసుల ఇన్వెస్టిగేష‌న్ చుట్టూ ఉత్కంఠ‌భ‌రిత‌మైన మ‌లుపుల‌తో ఎండింగ్ వ‌ర‌కు ద‌ర్శ‌కుడు ఎంగేజింగ్‌గా సినిమాను న‌డిపించాడ‌ని అంటున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింద‌ని అభిప్రాయ‌ప‌డుతోన్నారు.

ఉగ్రం కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ బాగున్నా అన‌వ‌స‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ హంగుల కార‌ణంగా ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ మిస్స‌యింద‌ని ట్వీట్స్ చేస్తున్నారు. క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు చాలా చోట్ల‌ త‌డ‌బ‌డిన‌ట్లు పేర్కొంటున్నారు.

ఓవ‌రాల్‌గా ఉగ్రం ఓ యావ‌రేజ్‌గా మూవీగా నిలుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతోన్నారు. అయితే పోలీస్ అఫీస‌ర్ పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ యాక్టింగ్ మాత్రం బాగుంద‌ని, మ‌రో డిఫ‌రెంట్ రోల్‌లో అద‌ర‌గొట్టాడ‌ని చెబుతోన్నారు.

IPL_Entry_Point