Suriya 42 Digital Rights: షూటింగ్ పూర్తికాకుండానే 100 కోట్ల‌కు సూర్య 42వ సినిమా డిజిట‌ల్ శాటిలైట్ డీల్-suriya 42 digital satellite rights sold out whopping price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya 42 Digital Rights: షూటింగ్ పూర్తికాకుండానే 100 కోట్ల‌కు సూర్య 42వ సినిమా డిజిట‌ల్ శాటిలైట్ డీల్

Suriya 42 Digital Rights: షూటింగ్ పూర్తికాకుండానే 100 కోట్ల‌కు సూర్య 42వ సినిమా డిజిట‌ల్ శాటిలైట్ డీల్

Nelki Naresh Kumar HT Telugu
Jan 03, 2023 09:25 AM IST

Suriya 42 Digital Rights: సూర్య హీరోగా సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ఓటీటీ శాటిలైట్ హ‌క్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సూర్య
సూర్య

Suriya 42 Digital Rights: సూర్య 42వ సినిమా ఓటీటీ, శాటిలైట్ డీల్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సూర్య హీరోగా సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ ఈ సినిమాలో సూర్య 12 డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సూర్య కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమా ఇదంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సినిమాలో సూర్య 16వ శ‌తాబ్దం నాటి పోరాట యోధుడి పాత్ర‌లో నటిస్తున్నాడు. రెండు టైమ్ పీరియ‌డ్స్‌లో డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతుంద‌ని చెబుతున్నారు. కాగా ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్‌తో పాటు హిందీ రైట్స్ వంద కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా హిందీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత, పంపిణీదారుడు జ‌యంతిలాల్ గ‌దా భారీ మొత్తానికి కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు.

షూటింగ్ పూర్తికాక‌ముందే వంద కోట్ల‌కు సినిమా రైట్స్ అమ్ముడుపోవ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆర్ఆర్ఆర్‌, విక్ర‌మ్‌, పొన్నియ‌న్ సెల్వ‌న్‌తో పాటు ప‌లు ద‌క్షిణాది సినిమాల‌ను జ‌యంతి లాల్ గ‌దా హిందీలో రిలీజ్ చేశారు. ఈ సినిమాల‌న్నీ పెద్ద విజ‌యాల్ని సాధించ‌డంతోనే సూర్య సినిమా హ‌క్కుల‌ను భారీ మొత్తానికి అత‌డు కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఈ పీరియాడిక‌ల్‌ సినిమాలో సూర్య‌కు జోడీగా దిశా ప‌టానీ న‌టిస్తోంది. ఇటీవ‌లే గోవాలో సూర్య‌, దిశా ప‌టానీల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. నెక్స్ట్ షెడ్యూల్ జ‌న‌వ‌రి రెండో వారంలో మొద‌లుకాబోతున్న‌ది. త్రీడీలో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. ప‌ది భాష‌ల్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సూర్య హీరోగా న‌టిస్తోన్న 42వ సినిమా ఇది.

IPL_Entry_Point

టాపిక్