SSMB29 Leaked Photo: ట్రెండ్ అవుతున్న మహేష్-రాజమౌళి ఫొటో.. ఎక్కడ కలిశారు చెప్మా?-ssmb29 mahesh babu and rajamouli photo viral in social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb29 Leaked Photo: ట్రెండ్ అవుతున్న మహేష్-రాజమౌళి ఫొటో.. ఎక్కడ కలిశారు చెప్మా?

SSMB29 Leaked Photo: ట్రెండ్ అవుతున్న మహేష్-రాజమౌళి ఫొటో.. ఎక్కడ కలిశారు చెప్మా?

Maragani Govardhan HT Telugu
Mar 17, 2023 06:10 PM IST

SSMB29 Leaked Photo: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళితో మహేష్ ఏదో మాట్లాడుతున్నట్లున్న ఈ ఫొటోను ఎప్పుడు, ఎక్కడ దిగారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

రాజమౌళితో మహేష్ బాబు
రాజమౌళితో మహేష్ బాబు

SSMB29 Leaked Photo: బాహుబలితో పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో తనేంటో నిరూపించుకున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ సైతం రావడంతో ఎక్కడ చూసిన మన జక్కన్న పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన తీయబోయే తర్వాతి చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాజమౌళి.. మహేష్‌తో ప్రాజెక్టుకు చేస్తారని కన్ఫార్మేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతంగా బజ్ ఏర్పడింది. తాజాగా ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఈ పొటో బయటకొచ్చింది. రాజమౌళి-మహేష్ కలిసి ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఈ ఫొటోను గమనిస్తే.. మహేష్ ఏదో చెబుతుంటే రాజమౌళి శ్రద్ధగా వింటున్నట్లు ఉంది. అయితే వీరిద్దరూ ఎప్పుడు, ఎక్కడ కలిశారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఫొటోను చూస్తుంటే వీరిద్దరూ తమ తదుపరి చిత్రం గురించి చర్చింకుంటున్నారా? లేక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలవడంపై మహేష్ అభినందిస్తున్నారా? లేక వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారా? అనే నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

రాజమౌళి-మహేష్ ఇద్దరూ ఇటీవలే కలుసుకున్నారని అని కొంతమంది చెబుతుండగా.. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా లాస్ ఏంజెల్స్ వెళ్లిన రాజమౌళి తిరిగి వస్తూ ఆ గ్యాప్‌లో మన ప్రిన్స్‌ను కలిశారంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదైతేనేమి ఈ కాంబో నుంచి ఎలాంటి వార్త వచ్చిన అది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సగటు సినీ ప్రియుడు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఎస్ఎస్ఎంబీ29 పట్టాలెక్కే అవకాశముంది.

యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి సాహసవీరుడి కథగా SSMB29 తెరకెక్కనుంది. ఈ కాంబినేషన్ గురించి రాజమౌళి తండ్రి, రచయిత వీ విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు తెలియజేశారు. గ్లోబల్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళితో మూవీ పట్టాలెక్కనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం