OM Bheem Bush OTT: అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి ఓం భీమ్ బుష్ - రిలీజ్ డేట్ ఇదేనా?
OM Bheem Bush OTT: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ అనుకున్నదానికంటే తేదీ కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది.
OM Bheem Bush OTT: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా హిట్ టాక్ తెచ్చుకున్నది. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్న ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలోకి రాబోతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో...
థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ దక్కించుకున్నది. ఈ కామెడీ మూవీ ఎప్రిల్ లాస్ట్ వీక్‌లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి.
అనుకున్నదానికంటే ముందుగానే...
తాజా సమాచారం ప్రకారం అనుకున్నదానికంటే ముందుగానే ఓ భీమ్ బుష్ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు. ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది.
పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్...
ఓంభీమ్ బుష్ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. హుషారు, రౌడీ బాయ్స్ తర్వాత శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన మూడో సినిమా ఇది. వరల్డ్ వైడ్‌గా తొమ్మిదిన్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఓం భీమ్ బుష్ ... పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా పదిహారు కోట్లకుపైగా గ్రాస్‌ను, ఎనిమిది కోట్ల యాభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్‌ను ఈ మూవీ రాబట్టింది.
తొలిరోజు మూడు కోట్ల డెబ్భై లక్షలు, రెండో రోజు నాలుగు కోట్ల వరకు కలెక్షన్స్‌ను ఓం భీమ్ బుష్ రాబట్టింది. గురువారం వరకు కోటికి తగ్గకుండా వసూళ్లను దక్కించుకున్నది. డీజే టిల్లు దెబ్బకు శుక్రవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా భారీగా డ్రాప్ అయ్యాయి. శుక్రవారం రోజు ఇరవై ఐదు లక్షల లోపే వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కు మరో కోటిన్నర దూరంలో ఈ మూవీ నిలిచింది.
ఓం భీమ్ బుష్ కథ ఇదే...
క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. వీరిని బ్యాంగ్ బ్రోస్ అందరూ పిలుస్తుంటారు. కాలేజీలో పీహెచ్‌డీ పేరుతో బ్యాంగ్ బ్రోస్ నానా రచ్చ చేస్తారు. వాళ్లు చేసే అల్లరి పనులతో వేగలేక తానే ఎగ్జామ్స్ రాసి ముగ్గురు స్నేహితుల్ని కాలేజీ నుంచి బయటకు పంపిస్తాడు ప్రిన్సిపాల్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్).
భైరవ పురం అనే ఊరిలో అడుగుపెట్టిన ఈ ముగ్గరు ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడం కోసం సైంటిస్ట్‌లుగా అవతారం ఎత్తుతారు. సైంటిస్టులుగా ప్రూవ్ చేసుకోవడానికి ఈ ముగ్గురికి భైరవకోన ప్రజలు ఓ పరీక్ష పెడతారు. అదేమిటి? సంపంగి మహల్‌లో ఉన్న నిధిని కనిపెట్టే క్రమంలో ఈ ముగ్గురు స్నేహితులు ఎలాంటి కష్టాలు పడ్డారు? సంపంగి మహల్‌లో ఉన్న దయ్యం కథేమిటి అన్నదే ఓం భీమ్ బుష్ కథ. లాజిక్స్‌తో సంబంధం లేకుండా కామెడీ ట్రాక్‌లు, పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు డైరెక్టర్ శ్రీహర్ష.
సామజవరగమనా తర్వాత...
ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రీతి ముకుందన్, ఆయేషాఖాన్ హీరోయిన్లుగా నటించారు. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందించాడు. బ్రోచేవారెవరురాతో హిట్టు అందుకున్న శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఓం భీమ్ బుష్‌లో ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేశారు. ముగ్గురి క్యారెక్టర్స్ హిలేరియస్‌గా నవ్వించాయి. శ్రీవిష్ణు గత మూవీ సామజవరగమనా కూడా కమర్షియల్ హిట్టుగా నిలిచింది.