Shehzada Trailer: అల వైకుంఠపురంలో హిందీ ట్రైలర్‌ చూశారా.. మక్కీకి మక్కీ కానీ..-shehzada trailer released as the movie to hit screens on february 10th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shehzada Trailer: అల వైకుంఠపురంలో హిందీ ట్రైలర్‌ చూశారా.. మక్కీకి మక్కీ కానీ..

Shehzada Trailer: అల వైకుంఠపురంలో హిందీ ట్రైలర్‌ చూశారా.. మక్కీకి మక్కీ కానీ..

Hari Prasad S HT Telugu
Jan 12, 2023 04:23 PM IST

Shehzada Trailer: అల వైకుంఠపురంలో హిందీలో వస్తోంది. షెహజాదా పేరుతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం (జనవరి 12) రిలీజ్‌ చేశారు. మక్కీకి మక్కీ ఆ మూవీని దించినా.. ఇందులో ఏదో వెలతి మాత్రం కనిపిస్తోంది.

షెహజాదా మూవీలో కార్తీక్ ఆర్యన్
షెహజాదా మూవీలో కార్తీక్ ఆర్యన్

Shehzada Trailer: టాలీవుడ్‌లో మూడేళ్ల కిందట సంక్రాంతి సినిమాల్లో ఒకటిగా వచ్చి సూపర్‌ డూపర్‌ హిట్ అయింది అల వైకుంఠపురంలో మూవీ. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన ఆ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేసింది. ఇప్పుడీ సినిమా హిందీలో రీమేక్‌ అయింది. ఈ సినిమా పేరు షెహజాదా. బాలీవుడ్ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ఇందులో లీడ్‌ రోల్‌లో కనిపించగా.. కృతి సనన్‌ ఫిమేల్‌ లీడ్‌లో నటించింది.

ఈ షెహజాదా ట్రైలర్‌ గురువారం (జనవరి 12) రిలీజైంది. ట్రైలర్‌ చూస్తున్నంతపు సేపు అల వైకుంఠపురంలోని ప్రతి సీన్‌ గుర్తుకు వస్తుంది. హిందీలో మంచి యాక్టర్‌ కార్తీక్‌ ఆర్యన్‌కు పేరున్నా.. ఎందుకో ఈ ట్రైలర్‌ మాత్రం కాస్త డల్లుగా కనిపించింది. అల వైకుంఠపురంలో మూవీకి మ్యూజిక్‌ హైలైట్‌. కానీ ఈ హెహజాదా అదే చాలా వీక్‌గా కనిపించింది. ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ మ్యూజిక్‌ అందించాడు.

తెలుగులో మురళీ శర్మ పోషించిన వాల్మీకి పాత్రను హిందీలో పరేష్‌ రావల్‌ పోషించాడు. తెలుగులో ఈ డూప్లికేట్‌ తల్లిదండ్రుల మధ్య సీన్లు చాలా సరదాగా సాగుతాయి. కానీ హిందీ ట్రైలర్‌లో మాత్రం అది మిస్‌ అయింది. ఇక కృతి సనన్‌ చాలా అందంగా కనిపించింది. వీళ్లిద్దరి మధ్య కెమెస్ట్రీ కూడా బాగానే కుదిరింది. ఇక షెహజాదాలో కార్తీక్‌ అసలు తండ్రి పాత్రలో రోనిత్‌ రాయ్‌, తల్లిగా మనీషా కొయిరాలా నటించారు.

రోహిత్‌ ధావన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ షెహజాదా మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతోంది. హిందీలో ఈ సినిమాను హీరో కార్తీక్‌తోపాటు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హారికా & హాసిని క్రియేషన్స్‌, టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. మరి తెలుగులో సూపర్ హిట్‌ అయిన ఈ సినిమా రీమేక్‌ హిందీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

Whats_app_banner