Shah Rukh Khan Aryan Khan: డెనిమ్ జాకెట్ రూ.99 వేలు, కార్గో ప్యాంట్ రూ.35 వేలు.. షారుక్ తనయుడి కొత్త బ్రాండ్ ధరలు ఇవీ-shah rukh khan promotes his son aryan khan new clothing brand dyavolx sky high prices shocks fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan Aryan Khan: డెనిమ్ జాకెట్ రూ.99 వేలు, కార్గో ప్యాంట్ రూ.35 వేలు.. షారుక్ తనయుడి కొత్త బ్రాండ్ ధరలు ఇవీ

Shah Rukh Khan Aryan Khan: డెనిమ్ జాకెట్ రూ.99 వేలు, కార్గో ప్యాంట్ రూ.35 వేలు.. షారుక్ తనయుడి కొత్త బ్రాండ్ ధరలు ఇవీ

Hari Prasad S HT Telugu
Mar 18, 2024 10:49 AM IST

Shah Rukh Khan Aryan Khan: షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ పేరుతో తీసుకొచ్చిన కొత్త బట్టల బ్రాండ్ ధరలు దిమ్మదిరిగేలా ఉన్నాయి. డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలుగా ఉండటం విశేషం.

డెనిమ్ జాకెట్ రూ.99 వేలు, కార్గో ప్యాంట్ రూ.35 వేలు.. షారుక్ తనయుడి కొత్త బ్రాండ్ ధరలు ఇవీ
డెనిమ్ జాకెట్ రూ.99 వేలు, కార్గో ప్యాంట్ రూ.35 వేలు.. షారుక్ తనయుడి కొత్త బ్రాండ్ ధరలు ఇవీ

Shah Rukh Khan Aryan Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతని కొత్త బ్రాండ్ డ్యావోల్ఎక్స్(DyavolX) ప్రమోషన్లలో షారుక్, అతని కూతురు సుహానా ఖాన్ బిజీగా ఉన్నారు. ఆదివారం (మార్చి 17) ఈ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి రాగా.. వీటి ధరలు చూసి షాక్ తింటున్నారు సగటు అభిమానులు.

ఆర్యన్ ఖాన్ బ్రాండ్ ధరలు ఇవీ..

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ (DyavolX) పేరుతో కొత్త బట్టల బ్రాండ్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను షారుక్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్యన్ ఖాన్ తోపాటు షారుక్, సుహానా ఈ కొత్త బ్రాండ్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. వీటిలో ట్రిపుల్ థ్రెట్ ఎక్స్ 2 పేరుతో హుడీస్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్, డెనిమ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయి.

వీటి ధరలు రూ.16 వేల నుంచి రూ.99 వేల వరకూ ఉన్నాయి. ఈ విషయాన్ని చెబుతూ.. "ఎక్స్-2 ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. http://dyavolx.com లో బుక్ చేసుకోండి. పరిమిత స్థాయిలోనే ఉంటాయి. గ్లోబల్ షిప్పింగ్ కూడా ఉంది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ పోస్ట్ చేశాడు. అయితే వీటి ధరలు చూసి సగటు అభిమానులు షాక్ తింటున్నారు.

దిమ్మదిరిగే ధరలు

ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ లో ఓ డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలు కావడం గమనార్హం. ఇక ఇందులోని హుడీస్ రూ.41 వేలు, రూ.40 వేలుగా ఉన్నాయి. గాళ్స్ కోసం క్రాప్ టాప్స్ రూ.16 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టర్ లో షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వేసుకున్న టీషర్ట్స్ ధర రూ.21,500 కావడం విశేషం. ఇక కార్గో ప్యాంట్ల ధర రూ.35 వేలుగా ఉంది.

నిజానికి ఇవి చాలా ఎక్కువ ధరలే అయినా.. గతంలో 2023లోనూ ఆర్యన్ ఖాన్ తన కలెక్షన్ తీసుకొచ్చాడు. వాటి ధరలైతే రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే మాత్రం ఇవి కాస్త తక్కువే అని చెప్పాలి. అప్పట్లో షారుక్ సంతకంతో ఉన్న హుడీస్ ధరను రూ.2,00,555గా నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి.

తన కొడుకు బ్రాండ్ కు షారుక్ ఇస్తున్న ప్రమోషన్ కూడా బాగా కలిసి వస్తోంది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలకుపైనే అయినా.. ఇప్పటికీ అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గతేడాది అతడు పఠాన్, జవాన్ లతో ఒకే ఏడాది రెండు రూ.1000 కోట్ల కలెక్షన్లు సినిమాలు అందించాడంటే అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏడాది చివర్లో డంకీ మూవీతో వచ్చినా.. అది ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. మరోవైపు ఆర్యన్ ఖాన్ రెండేళ్ల కిందట ఓ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టు అతన్ని నిర్దోషిగా వదిలేసింది.

Whats_app_banner