Save the Tigers Trailer: సేవ్ ది టైగర్స్ ట్రైలర్ వచ్చేసింది.. మగాళ్ల అస్తిత్వం కాపాడాలంటూ నానా హంగామా-save the tigers web series trailer out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Save The Tigers Trailer: సేవ్ ది టైగర్స్ ట్రైలర్ వచ్చేసింది.. మగాళ్ల అస్తిత్వం కాపాడాలంటూ నానా హంగామా

Save the Tigers Trailer: సేవ్ ది టైగర్స్ ట్రైలర్ వచ్చేసింది.. మగాళ్ల అస్తిత్వం కాపాడాలంటూ నానా హంగామా

Maragani Govardhan HT Telugu
Apr 13, 2023 11:35 AM IST

Save the Tigers Trailer: ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ ఏప్రిల్ 27 నుంచి హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

సేవ్ ది టైగర్స్ ట్రైలర్ రిలీజ్
సేవ్ ది టైగర్స్ ట్రైలర్ రిలీజ్

Save the Tigers Trailer: ఇటీవల బలగం సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు నటుడు ప్రియదర్శి. ఓ పక్క నటుడిగా ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోపక్క సోలో హీరోగానూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలుగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే సేవ్ ది టైగర్స్. మహీ వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ వెబ్‌సిరీస్‌కు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మంచి కామెడీతో పాటు సందేశాన్ని తెలియజేసేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మగాళ్ల అస్తిత్వమును కాపాడాలంటూ ప్రియదర్శి, చైతన్య, అభినవ్ చేసే అల్లరి ఆసక్తికరంగా ఉంది. సిరీస్ ఆద్యంతం ఫుల్ ఫన్నీగా సాగుతుందనిపిస్తోంది. పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత ఓ ముగ్గురు యువ‌కుల జీవితాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సేవ్ ది టైగ‌ర్స్‌ వెబ్ సిరీస్ తెరకెక్కినట్లు సమాచారం.

ఈ ట్రైలర్ చివర్లో ప్రియదర్శి చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. నేచర్ మగాళ్లకు పిల్లలను కనే శక్తినిస్తే పేకాట ఆడుతూ కనేవాళ్లం సార్ అనే సంభాషణ ఫన్నీగా ఉంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుంది.

ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ సరసన.. బిగ్‌బాస్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని నటించారు. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకులు మహీ వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేశారు. తేజ కాకుమాను దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

IPL_Entry_Point