RRR: ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్‌ మూవీ ఆర్ఆర్‌ఆర్‌-rrr is the first indian movie to nominate for hca awards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr: ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్‌ మూవీ ఆర్ఆర్‌ఆర్‌

RRR: ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్‌ మూవీ ఆర్ఆర్‌ఆర్‌

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 03:31 PM IST

RRR మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా ఉంది. ఈ సినిమా రిలీజై మూడు నెలలు దాటినా ఎక్కడో ఓ చోట ఏదో ఒక రికార్డును, అరుదైన ఘనతను సొంతం చేసుకుంటూనే ఉంది.

ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ (HT File Photo)

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు రాజమౌళి. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచీ కలెక్షన్ల రికార్డులో లేక మరొకటో ఏదో ఒక ఘనతతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. రామ్‌, భీమ్‌గా రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ జీవించేసిన ఆర్ఆర్‌ఆర్‌ తాజాగా మరో అరుదైన ఘనత అందుకుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్‌ సినిమాకు దక్కని గౌరవం ఇది.

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అవార్డులకు ఈ మూవీ నామినేట్‌ అయింది. ఈ అవార్డు కోసం మరో 9 పాపులర్‌ హాలీవుడ్‌ సినిమాలతో ఆర్‌ఆర్‌ఆర్‌ పోటీ పడనుంది. గతంలో ఏ ఇండియన్‌ సినిమా కూడా ఈ అవార్డులకు నామినేట్‌ కాలేదు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తన అధికారిక ట్విటర్‌లో వెల్లడించింది. టామ్‌ క్రూజ్‌ మూవీ టాప్‌ గన్‌ మావెరిక్‌, ద బ్యాట్‌మ్యాన్‌ ఎల్విస్‌, ఎవిరిథింగ్‌ ఎవిరివేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, ది నార్త్‌మ్యాన్‌, టర్నింగ్‌ రెడ్‌, చా చా రియల్‌ స్మూత్‌లాంటి ఇంగ్లిష్‌ మూవీలతో పోటీ పడనుంది.

ఈ నామినేషన్‌తో చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. హెచ్‌సీఏ క్రిటిక్స్‌లో బెస్ట్‌ పిక్చర్‌ కేటగిరీకి ఆర్‌ఆర్‌ఆర్‌ నామినేట్‌ అవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ మూవీ ట్విటర్‌ పోస్ట్‌ చేసింది. తెలుగు, హిందీల్లోనే కాదు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ వచ్చిన తర్వాత హాలీవుడ్‌ స్థాయిలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి చర్చ జరిగింది.

అక్కడి ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ఈ మూవీని ప్రశంసించడం విశేషం. ఆర్‌ఆర్‌ఆర్‌లోని విజువల్స్‌, సినిమాటోగ్రఫీలాంటివి అక్కడి వాళ్లను కూడా మెస్మరైజ్‌ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లోని మోస్ట్‌ పాపులర్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మార్చి 25న ఈ సినిమా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం