Where is Samantha: సమంత ఎక్కడ? సోషల్ మీడియాలో లేదు.. షూటింగ్స్‌కూ దూరం..!-reportedly samantha to take a long leave from shootings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Reportedly Samantha To Take A Long Leave From Shootings

Where is Samantha: సమంత ఎక్కడ? సోషల్ మీడియాలో లేదు.. షూటింగ్స్‌కూ దూరం..!

Maragani Govardhan HT Telugu
Sep 20, 2022 09:50 AM IST

Samantha Break for Movies: సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత ఈ మధ్య కాలంలో పెద్దగా యాక్టివ్‌గా ఉండట్లేదు. తాజాగా సినిమాలకు కూడా లాంగ్ లీవ్ తీసుకున్నట్లు సమచారం.

సమంత రూత్ ప్రభు
సమంత రూత్ ప్రభు (HT_PRINT)

Samantha Take Long Leave For shootings: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. కనీసం అక్కడ కూడా ఉండట్లేదు. అడపాదడపా పోస్టులు మినహా.. ఇంటర్నెట్‌లో ఈ బ్యూటీ కనుమరుగైందనే చెప్పాలి. ఇదిలా ఉంటే సామ్.. సినిమా షూటింగ్స్‌కు కూడా పెద్దగా హాజరు కావట్లేదని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమా షూటింగులకు లాంగ్ గ్యాప్ తీసుకున్నట్లు సమాచారం. ఫలితంగా అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి.

సామ్‌ అనారోగ్య కారణాలతో బాధపడుతుందని, అందుకే తను సినిమా షూటింగుల్లోనూ పాల్గొనడం లేదని సమాచారం. సోషల్ మీడియాలో ఊహాగానాలు, పుకార్లకు కూడా సామ్ రిప్లయి ఇవ్వకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నట్లయింది. సమంత తన అనారోగ్య సమస్యలపై ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే షూటింగులకు తాత్కాలిక బ్రేక్ తీసుకుందట.

ఏదిఏమైనప్పటికీ వచ్చే రెండు, మూడు నెలల వరకు సమంత సినిమా షూటింగులకు హాజరు కావట్లేదని సమాచారం. ఈ మేరకు తను అందుబాటులో ఉండట్లేదని ఖుషి సినిమా టీమ్‌కు కూడా సామ్ సమాచారమిచ్చిందట. దీంతో ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ.. సమంత లేకుండానే షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఆమె లేని కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హీరోయిన్ తాప్సీ నిర్మించే సినిమాలోనూ సమంతాను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులతో పాటు రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లోనూ సమంత కనిపించనుంది. ఈ వెబ్‌సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించనుంది. తెలుగులో సామ్ ఖుషితో పాటు శాకుంతలం, యశోధ లాంటి చిత్రాలు చేస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం