Rana Kidnaps Pilot for Janhvi: జాన్వీ కోసం పైలట్‌ను కిడ్నాప్ చేసిన రానా.. ఎందుకో తెలుసా?
Rana Kidnaps Pilot for Janhvi: భాషతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నాడు రానా. తాజాగా అతడు నటించిన బాలీవుడ్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా జాన్వీ కపూర్‌తో కలిసి అతడు ఓ ప్రమోషనల్ వీడియో చేశాడు.
Rana Kidnaps Pilot for Janhvi: రానా దగ్గుబాటి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి లాంటి సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న రానా.. ఆ రేంజ్‌లో భారీ సినిమాలు రాలేదనే చెప్పాలి. ఎప్పుడూ ప్రయోగాలను ఇష్టపడుతూ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు ఈ హీరో. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడులో నటించాడు. ఈ సిరీస్ వచ్చే మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీమ్ ప్రమోషన్లలో ఫుల్ బిజీ అవుతోంది. ఇందులో భాగంగా జాన్వీ కపూర్ కూడా ఈ టీమ్‌కు తోడైంది. ఈ సిరీస్‌లో జాన్వీ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వీడియోను గమనిస్తే రానా దగ్గుబాటి సెలబ్రెటీల సమస్యలను తీర్చే హై ఎండ్ ఫిసెలిటేటర్‌గా పనిచేస్తుంటాడు. కొంతమందిని చంపుతుంటాడు, మరికొంతమందిని చావు వరకు తీసుకెళ్తుంటాడు. ఇంతలో జాన్వీ కపూర్.. రానా వద్దకు వచ్చి పోలీసులపై ఫిర్యాదు చేస్తోంది. దీంతో రానా ఏ పోలీసులు తనను ఇబ్బంది పెట్టాడో అడుగుతాడు.
ఏ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు.. దిల్లీ పోలీస్, ముంబయి పోలీస్, గోవా పోలీస్, పుణె పోలీస్ ఎవరు? అని జాన్వీని రానా అడుగుతాడు. ఇందుకు ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ పోలీస్ అని బదులిస్తుంది. వెంటనే రానా.. ఓ విమాన పైలట్‌ను కొట్టి అతడి చేత జాన్వీకి క్షమాపణలు చెప్పిస్తాడు. అంతటితో ఆగకుండా జాన్వీ ఎయిర్‌పోర్టుకు వెళ్లే పనిలేకుండా డైరెక్టుగా ఆమె ఇంటి వద్దకే తీసుకొస్తానని మాటిస్తాడు. చూసేందుకు ఈ యాడ్ లాజిక్ లెస్‌గా ఉన్నప్పటికీ టార్గెట్ ఆడియెన్స్‌కు రీచ్ అయిందనే చెప్పాలి.
అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానా నాయుడు స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం