Rana and Janhvi Kidnap A man: వ్యక్తిని కిడ్నాప్ చేసిన రానా-జాన్వీ.. 'కారు డిక్కీలో తొంగోబెట్టేశారు'..!-rana and janhvi kapoor shoving a man in a car trunk ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana And Janhvi Kidnap A Man: వ్యక్తిని కిడ్నాప్ చేసిన రానా-జాన్వీ.. 'కారు డిక్కీలో తొంగోబెట్టేశారు'..!

Rana and Janhvi Kidnap A man: వ్యక్తిని కిడ్నాప్ చేసిన రానా-జాన్వీ.. 'కారు డిక్కీలో తొంగోబెట్టేశారు'..!

Maragani Govardhan HT Telugu
Mar 03, 2023 10:22 PM IST

Rana and Janhvi Kidnap A man: రానా, జాన్వీ కపూర్ క్రైమ్‌లో ఇరుక్కున్నారు.. ఏంటి నిజమా అనుకుంటున్నారా? అవును వీరిద్దరూ కలిసి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కారు డిక్కీలో ఉంచి తీసుకెళ్లడం ఓ వీడియోలో రికార్డయింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

వ్యక్తిని కిడ్నాప్ చేస్తున్న రానా-జాన్వీ కపూర్
వ్యక్తిని కిడ్నాప్ చేస్తున్న రానా-జాన్వీ కపూర్

Rana and Janhvi Kidnap A man: రానా దగ్గుబాటి బాహుబలితో దేశవ్యాప్తంగా తన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రానా నాయుడు అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో సందడి చేయబోతున్నాడు. ఇందులో తొలిసారి విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించాడు ఈ స్టార్. ఓ పక్క సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రానా.. తాజాగా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్నాడు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా అతడికి తోడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఎవ్వరూ చూడకుండా ఓ వ్యక్తిని కారు డిక్కీలో పడుకొబెట్టి అక్కడ నుంచి వాహనంతో సహా పరారయ్యారు.

ఇదేంటి రానా, జాన్వీ కలిసి ఎవ్వరినీ కిడ్నాప్ చేశారు? అనే అనుమానం అందరికీ వస్తోంది. అయితే ఇదంతా నిజం కాదని చూడగానే తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన ఈ వీడియో రానా నాయుడు సిరీస్‌కు ప్రమోషన్‌లో భాగంగా చేసినట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా "జాన్వీ, రానా కలిసి చేసిన ఈ చీకటి వ్యాపారంపై ఓ కన్నేశాం" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్యాప్షన్‌ను కూడా జతచేసింది నెట్‌ఫ్లిక్స్. దీంతో ఇది ప్రమోషనల్ వీడియో అని తెలుస్తుంది.

అయితే రానా, వెంకటేష్ కలిసి నటించిన ఈ సిరీస్‌లో జాన్వీకి ఏం పని అనే అనుమానం రావచ్చు. అనధికార సమాచారం ప్రకారం ఇందులో జాన్వీ కపూర్ కూడా అతిథి పాత్రలో మెరవనుందట. దీంతో సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే వెంకటేష్ లుక్, రానా పర్ఫార్మెన్స్‌తో సిరీస్‌ ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తోనే అందర్నీ ఆకర్షించారు మేకర్స్.

అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానా నాయుడు స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner