Ranveer Nude Photo: రణ్‌వీర్‌‌పై వర్మ స్పందన.. స్త్రీలేనా మగవాళ్లు చూపించకూడదా?-ram gopal varma reaction on ranveer singh controversial photoshoot ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranveer Nude Photo: రణ్‌వీర్‌‌పై వర్మ స్పందన.. స్త్రీలేనా మగవాళ్లు చూపించకూడదా?

Ranveer Nude Photo: రణ్‌వీర్‌‌పై వర్మ స్పందన.. స్త్రీలేనా మగవాళ్లు చూపించకూడదా?

Maragani Govardhan HT Telugu
Jul 26, 2022 07:39 AM IST

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నగ్నచిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మహిళల తమ సెక్సీ శరీరాన్ని చూపించినప్పుడు మగవాళ్లు ఎందుకు చేయకూడదంటూ ప్రశ్నించారు.

<p>రణ్‌వీర్‌పై రామ్ గోపాల్ వర్మ స్పందన</p>
<p>రణ్‌వీర్‌పై రామ్ గోపాల్ వర్మ స్పందన</p> (Twitter)

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇటీవలే న్యూడ్ ఫొటోతో నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. పెప్పర్ మ్యాగజైన్‌ కోసం అతడు నగ్నంగా ఫొటో దిగి ఆ చిత్రాలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. క్షణాల్లో ట్రెండ్ అవ్వడమే కాకుండా సర్వత్రా అతడిపై కామెంట్ల వర్షం కురిసింది. కొంతమంది రణ్‌వీర్ ధైర్యానికి ప్రశంసించగా.. మరి కొంతమంది మాత్రం విమర్శలు గుప్పించారు. తాజాగా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. రణ్‌వీర్ నగ్న చిత్రంపై స్పందించారు.

తన లడ్కీ సినిమాతో లింగ సమానత్వం గురించి మాట్లాడిన ఆయన.. రణ్‌వీర్ ఫొటో షూట్‌‌పై కూడా తనదైన రీతిలో స్పందించారు. “లింగ సమానత్వం కోసం తనదైన మార్గంలో అతడు(రణ్‌వీర్) న్యాయం కోసం డిమాండ్ చేశాడు. స్త్రీలు తమ సెక్సీ శరీరాన్ని ప్రదర్శించగలిగితే.. పురుషులు ఎందుకు చేయలేరు? పురుషులను వేరో ప్రమాణంంలో చూడటం ఇందుకు విరుద్ధం. మహిళల మాదిరిగానే మగవారికి సమాన హక్కులు ఉంటాయి” అంటూ రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు.

రణ్‌వీర్ నగ్నచిత్రంపై సర్వత్ర మిశ్రమ స్పందనలు వ్యక్తిమవుతున్నాయి. అతడితో కలిసి నటించిన ఆలియా భట్ ఇటీవల స్పందించింది. “నా అభిమాన హీరో అయిన రణ్‌వీర్ గురించి ఏదైనా నెగిటివ్‌గా మాట్లాడటం నాకిష్టముండదు. ఇలాంటి ప్రశ్ననే నేను అస్సలు సహించను. అతడంటే నాకిష్టం. సినిమాల్లో అతడు తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి నచ్చిన వ్యక్తి. కాబట్టి మనం అతడికి ప్రేమను మాత్రమే ఇవ్వాలి.” అంటూ రణ్‌వీర్‌ సింగ్‌కు మద్దతుగా మాట్లాడింది ఆలియా.

ఈ విషయంపై రణ్‌వీర్ స్నేహేతుడు అర్జున్ కపూర్ కూడా స్పందించాడు. అతడు తనకు ఆనందాన్నిచ్చే పనినే చేస్తున్నాడని, ప్రజలు దీన్ని గౌరవించాలని సింబా హీరోకు మద్దతుగా నిలిచాడు అర్జున్. అయితే మరికొంతమంది మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటివి చేయడమేంటనే రణ్‌వీర్‌ తీరును ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్