Sankranti Movies : వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫైట్!-ram charan 15th movie and allu arjun starrer pushpa 2 cinema may clash in sankranti 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Ram Charan 15th Movie And Allu Arjun Starrer Pushpa 2 Cinema May Clash In Sankranti 2024

Sankranti Movies : వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫైట్!

రామ్ చరణ్, అల్లు అర్జున్
రామ్ చరణ్, అల్లు అర్జున్

2024 Sankranti Movies : 2023 సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించాయి. దీంతో భారీ చిత్రాల మేకర్స్ 2024 సంక్రాంతి పైనా దృష్టి పెట్టారు. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటీ పడనున్నట్టుగా తెలుస్తోంది.

సంక్రాంతి(Sankranti) అనగానే సినిమాల పండగ. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలను ఈ పండగకే ప్లాన్ చేసుకుంటారు. నిర్మాతలు కూడా మెుగ్గు చూపుతారు. 2023 సంక్రాంతిలోనూ భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. బాలకృష్ణ వీర సింహా రెడ్డి(Veera Simha Reddy), చిరంజీవి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) బరిలో నిలిచాయి. తమిళం నుంచి వారిసు(వారసుడు), తునివు రిలీజ్ చేశారు. అన్ని చిత్రాలు మంచి కలెక్షన్స్ చేశాయి. ఈ కారణంగా అనేక మంది నిర్మాతలు 2024 సంక్రాతిపై ఫోకస్ పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించారు. పుష్ప 2 సినిమాను కూడా వాళ్లే నిర్మిస్తున్నారు. పుష్ప హిట్ తో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. 2024 సంక్రాంతికి పుష్ప 2ను విడుదల చేసేందుకు మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.

రామ్ చరణ్ 15వ(Ram Charan 15th Movie) మూవీ ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అతడి నిర్మాణంలోనే వారిసు(Varisu) వచ్చింది. సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఈ కారణంతో దిల్ రాజు కూడా వచ్చే సంక్రాంతి మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతాయని, స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటుందని టాక్ నడుస్తోంది.

రామ్ చరణ్, అల్లు అర్జున్‌(Ram Charan Allu Arjun) కుటుంబ సభ్యులే. ఇద్దరి సినిమాలు దగ్గరలోనే విడుదల చేస్తే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ 15వ సినిమా.. దర్శకుడు శంకర్ నుంచి వస్తోంది. అదే విధంగా పుష్ప 2(Pushpa 2) చిత్రానికి సుకుమార్ దర్శకుడు. రెండు సినిమాలు భారీ బడ్జెట్‌లో రూపొందుతున్నాయి. దీంతో భారీ అంచనాలు ఉన్నాయి.

రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్'(RRR) సినిమా సూపర్ హిట్ అయింది. విదేశాలలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక రామ్ చరణ్‌ 15వ సినిమాపై ఆసక్తి ఉంది. అదే విధంగా అల్లు అర్జున్(Allu Arjun) 'పుష్ప' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో పుష్ప 2 చిత్రంపై అంచనాలు పెరిగాయి. రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయినా బాక్సాఫీసును షేక్ చేస్తాయని అంటున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం