Rakhi Sawant Fires on Adil: భర్తపై విరుచుకు పడిన రాఖీ సావంత్.. వేరే అమ్మాయితో అఫైర్ ఉందని స్పష్టం-rakhi sawant saya her husband adil khan had extra marital affair
Telugu News  /  Entertainment  /  Rakhi Sawant Saya Her Husband Adil Khan Had Extra Marital Affair
రాఖీ సావంత్
రాఖీ సావంత్

Rakhi Sawant Fires on Adil: భర్తపై విరుచుకు పడిన రాఖీ సావంత్.. వేరే అమ్మాయితో అఫైర్ ఉందని స్పష్టం

02 February 2023, 21:06 ISTMaragani Govardhan
02 February 2023, 21:06 IST

Rakhi Sawant Fires on Adil: బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు వేరే అమ్మాయితో అఫైర్ ఉందని, అతడు పచ్చి మోసగాడని ఘాటుగా విమర్శించింది.

Rakhi Sawant Fires on Adil: బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్.. ఇటీవలే తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ బాధ తీరక ముందే మరో విషయంపై కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన భర్త ఆదిల్ ఖాన్‌కు వేరే అమ్మాయితో అఫైర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుని సుఖంగా ఉందాముకున్న తనను.. ఆ సంతోషాన్ని మూడు నాళ్ల ముచ్చటే చేశాడని వాపోయింది. జిమ్ నుంచి బయటకొస్తూ మీడియాతో మాట్లాడిన రాఖీ.. భర్త ఆదిల్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అతడు తన ద్వారా ఫేమస్ అవుదామనుకున్నాడని, కాబట్టి అతడిని ఎవ్వరూ కూడా ఇంటర్వ్యూ చేయొద్దని మీడియాను అభ్యర్థించింది.

"నా పెళ్లి ప్రమాదంలో పడింది. ఆదిల్ మరో అమ్మాయికి దగ్గరవుతున్నాడు. ఆ అమ్మాయిని మర్చిపోతానని ఖురాన్ మీద ఒట్టేసి చెప్పాడు. కానీ అతడు ఆ మాట తప్పాడు. ఆదిల్ పెద్ద మోసగాడు. ఆ అమ్మాయి దగ్గర కొన్న డర్టీ ప్రూఫ్స్ ఉండటంతో నా భర్తను బ్లాక్ మెయిల్ చేస్తోంది. దయచేసి ఎవ్వరూ కూడా ఆదిల్‌ను ఇంటర్వ్యూ చేయకండి. ఎందుకంటే అతడు నన్ను వాడుకుని ఇండస్ట్రీకి వద్దామనుకున్నాడు. ఫేమస్ అవుతాదమనుకున్నాడు. కాబట్టి ఎవ్వరూ కూడా అతడి స్టార్ చేయకండి. మీడియా సమక్షంలో ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తున్నాను. భార్య, భర్త మధ్యలోకి రావద్దని హెచ్చరిస్తున్నా. ఓ మహిళ అయి ఉండి మరో మహిళ జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటోంది. ఆదిల్ నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఆ అమ్మాయిని మర్చిపో. నాకు రంజాన్‌కు ఎలాంటి బహుమతి ఇచ్చావో అర్థమవుతుంది." అని భర్తపై రాఖీ సావంత్ మండిపడింది.

రాఖీ సావంత్ ఇటీవలే ఆదిల్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అయితే ఆ ఆనంద ఘడియలు ఆమెకు ఎక్కువ సేపు నిలువలేదు. రాఖీ తల్లి జనవరి 28న ముంబయిలో కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్. క్యాన్సర్‌తో పోరాడిన ఆమె గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంది. ఇటీవల ఆమె మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న రాఖీ తాజాగా మరోసారి వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటోంది.

సంబంధిత కథనం

టాపిక్