కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నటి రాఖీ సావంత్ తల్లి.. జయ సావంత్(Jaya Sawant) మృతి చెందారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న జయ జనవరి 28న ముంబైలోని జుహు ప్రాంతంలోని సిటీ కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నప్పటికీ, పరిస్థితి విషమిచింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి కొన్ని రోజులుగా ఆందోళనకరంగా ఉంది.
రాఖీ సావంత్ తల్లి జయ ఏప్రిల్ 2021 నెలలో గర్భాశయ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె పిత్తాశయంలోని కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు క్యాన్సర్ పరిస్థితి విషమించి.. రాఖీ సావంత్ తల్లి చనిపోయారు.
రాఖీ తన తల్లి మరణ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌లో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ సోషల్ మీడియాలో తరచూ తన తల్లి ఆరోగ్య విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే, మీరు కూడా మా అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని అభిమానులను అభ్యర్థించేది.
తన తల్లి మరణంతో రాఖీ సావంత్ (Rakhi Sawant) బోరున విలపిస్తోంది. రాఖీ సావంత్ బిగ్ బాస్ 14 సీజన్ లో పాల్గొంటున్న సమయంలో జయకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జయాబేడా మరణంపై రాఖీ సావంత్ సన్నిహితులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
టాపిక్