Kamal Haasan vs Rajinikanth: కమల్ వర్సెస్ రజనీ - 18 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వార్‌కు సిద్ధమైన సూపర్ స్టార్స్!
Kamal Haasan vs Rajinikanth: కోలీవుడ్ సూపర్‌స్టార్స్ కమల్‌హాసన్, రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన ఈ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
Kamal Haasan vs Rajinikanth: కమల్‌హాసన్, రజనీకాంత్ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తే అభిమానులకు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటి అరుదైన సందర్భంగా డిసెంబర్ 8న రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారు. అయితే కొత్త సినిమాలతో కాదు రీ రిలీజ్ మూవీస్‌తో. రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ ముత్తు డిసెంబర్ 8న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.
అదే రోజు కమల్‌హాసన్ సైకో థ్రిల్లర్ మూవీ అభయ్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాల స్పెషల్ షోస్ కోసం అభిమానులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిసింది. చివరగా రజనీకాంత్, కమల్‌హాసన్ బాక్సాఫీస్ వద్ద 2005లో పోటీపడ్డారు. రజనీకాంత్ చంద్రముఖి, కమల్‌హాసన్ ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.
వీటిలో చంద్రముఖి ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా...ముంబై ఎక్స్‌ప్రెస్ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. 18 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్, రజనీ బాక్సాఫీస్ వార్‌కు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. ముత్తు సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు.
మీనా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ థియేటర్లలో 200 రోజులు ఆడింది. జపాన్‌లో రిలీజైన ఈ మూవీ అక్కడ కూడా భారీగా వసూళ్లను రాబట్టింది. కమల్‌హాసన్ అభయ్ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో కమల్‌హాసన్ నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం సినిమా ఆడలేదు.