Prem Kumar trailer: పెళ్లిళ్లు ఆపే డిటెక్టివ్.. ఫన్నీగా ప్రేమ్ కుమార్ ట్రైలర్-prem kumar trailer released as another fun ride from santosh shobhan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prem Kumar Trailer: పెళ్లిళ్లు ఆపే డిటెక్టివ్.. ఫన్నీగా ప్రేమ్ కుమార్ ట్రైలర్

Prem Kumar trailer: పెళ్లిళ్లు ఆపే డిటెక్టివ్.. ఫన్నీగా ప్రేమ్ కుమార్ ట్రైలర్

Hari Prasad S HT Telugu
Jul 18, 2023 09:17 PM IST

Prem Kumar trailer: పెళ్లిళ్లు ఆపే డిటెక్టివ్ కథతో ఫన్నీగా సాగిపోయింది ప్రేమ్ కుమార్ మూవీ ట్రైలర్. యంగ్ హీరో సంతోష్ శోభన్ మరోసారి ఓ డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ప్రేమ్ కుమార్ మూవీలో సంతోష్ శోభన్
ప్రేమ్ కుమార్ మూవీలో సంతోష్ శోభన్

Prem Kumar trailer: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ మరో ఫన్నీ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమా పేరు ప్రేమ్ కుమార్. పెళ్లి కోసం పరితపించే యువకుడు.. అదే పెళ్లిళ్లను చెడగొట్టే డిటెక్టివ్ గా మారిన స్టోరీతో ఈ సినిమా వస్తోంది. తాజాగా మంగళవారం (జులై 18) ప్రేమ్ కుమార్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్.

ఈ ట్రైలర్ చాలా సరదాగా సాగిపోయింది. నా పేరు ప్రేమ్ కుమార్.. పెళ్లిళ్లు ఆగిపోవడంలో నాకో ట్రాక్ రికార్డు ఉందంటూ సంతోష్ చెప్పే డైలాగుతో ఈ మూవీ ట్రైలర్ మొదలవుతుంది. ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా.. ఏదో ఒక కారణంతో అవి కాస్తా ఆగిపోతుంటాయి. కొన్ని ఏకంగా పెళ్లి పీటల వరకూ వచ్చి, తాళి కట్టే సమయంలో ఆగిపోతాయి.

దీంతో ఇక జీవితంలో పెళ్లి చేసుకోనని ఫిక్సయిపోతాడు ప్రేమ్ కుమార్. అక్కడి నుంచి ఆ పెళ్లిళ్లు చెడగొట్టడాన్నే బిజినెస్ గా మార్చుకుంటూ పీకే ప్రీ మారిటల్ డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. పెళ్లిళ్లను ఆపడమే పనిగా పెట్టుకుంటాడు. చివరికి ఇక చాలు.. ఓ పెళ్లి జరిపిద్దామనుకునే సమయానికి కథ రివర్స్ అవుతుంది. ఆ పెళ్లి కూతురు ఈ ప్రేమ్ కుమార్ కు పడిపోతుంది.

అక్కడి నుంచి కథ ఎలా నడుస్తుందన్నది ఈ ప్రేమ్ కుమార్ సినిమాలో చూడాల్సిందే. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సంతోష్ మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ మంచి బ్రేక్ మాత్రం దక్కలేదు. ఈ మధ్యే వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమా కూడా అతనికి నిరాశనే మిగిల్చింది.

ఇప్పుడీ ప్రేమ్ కుమార్ ఏం చేస్తుందో చూడాలి. ఈ సినిమా ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే మూవీ మొత్తం సరదాగా సాగిపోతూ నవ్వులు పూయించడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రాశీ సింగ్ ఫిమేల్ లీడ్ రోల్లో నటించింది. అభిషేక్ మహర్షి డైరెక్ట్ చేశాడు.

IPL_Entry_Point

టాపిక్