Prakash raj Comments On Manchu Vishnu: ప్ర‌క‌టిస్తే ప‌నులు చేసిన‌ట్లు కాదు - మంచు విష్ణుపై ప్ర‌కాష్ రాజ్ కామెంట్స్‌-prakash raj sensational comments on manchu vishnu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prakash Raj Comments On Manchu Vishnu: ప్ర‌క‌టిస్తే ప‌నులు చేసిన‌ట్లు కాదు - మంచు విష్ణుపై ప్ర‌కాష్ రాజ్ కామెంట్స్‌

Prakash raj Comments On Manchu Vishnu: ప్ర‌క‌టిస్తే ప‌నులు చేసిన‌ట్లు కాదు - మంచు విష్ణుపై ప్ర‌కాష్ రాజ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 29, 2022 06:57 AM IST

Prakash raj Comments On Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ మంచు విష్ణుపై ప్ర‌కాష్‌రాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌క‌టిస్తే ప‌నులు పూర్త‌యిన‌ట్లు కాద‌ని అన్నాడు. ప్ర‌కాష్ రాజ్ కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

ప్ర‌కాష్‌రాజ్‌
ప్ర‌కాష్‌రాజ్‌

Prakash raj Comments On Manchu Vishnu: గ‌త ఏడాది జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు అనేక మ‌లుపులు తిరుగుతూ వివాదాల‌కు దారితీశాయి. ఈ ఎన్నిక‌ల్లో చిరంజీవి మ‌ద్ధ‌తుతో బ‌రిలో దిగిన ప్ర‌కాష్‌రాజ్‌పై మంచు విష్ణు విజ‌యాన్ని సాధించాడు. మా బిల్డింగ్ ఎజెండాగా మంచు విష్ణు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా ఇటీవ‌ల ఓ ప్రెస్‌మీట్‌లో తాను చేస్తాన‌ని హామీ ఇచ్చిన ప‌నుల్లో 95 శాతం పూర్తిచేసిన‌ట్లు మంచు విష్ణు తెలిపాడు. మా బిల్డింగ్ కూడా క‌ట్టితీరుతాన‌ని అన్నాడు. విష్ణు కామెంట్స్‌పై ప్ర‌కాష్ రాజ్ స్పందించారు.

మా ప్రెసిడెంట్‌గా తాను చేసే ప‌నుల‌ను విష్ణు స‌మ‌ర్థించుకుంటున్నార‌ని, అత‌డి మాట‌ల‌ను న‌మ్మేవాళ్లు న‌మ్ముతార‌ని., న‌మ్మ‌ని వాళ్లు న‌మ్మ‌ర‌ని ప్ర‌కాష్ రాజ్ పేర్కొన్నాడు. వాటి గురించి ఆలోచించే టైమ్ త‌న‌కు లేద‌ని అన్నాడు.

మంచు విష్ణు చేసే ప‌నుల ప‌ట్ల మెంబ‌ర్స్ సంతోషంగా లేక‌పోతే వాళ్లే ప్ర‌శ్నిస్తార‌ని ప్ర‌కాష్‌రాజ్ తెలిపాడు. ప్ర‌క‌టిస్తే ప‌నులు పూర్త‌యిన‌ట్లు కాదు అని చెప్పారు. గెలిచిన త‌ర్వాత వాళ్లు ఏం ప‌నులు పూర్తి చేశార‌న్న‌ది అంద‌రికి తెలుసున‌ని పేర్కొన్నారు. అలాగే ప‌నులు చేశారా లేదా అన్న‌ది స‌భ్యుల‌కు తెలుసున‌ని ప్ర‌కాష్‌రాజ్ తెలిపాడు.

విష్ణు అధికారంలోకి వ‌చ్చి ఏడాది అయ్యింద‌ని, అత‌డిని వ‌దిలేయండ‌ని అన్నాడు. వ‌చ్చే మా ఎల‌క్ష‌న్స్‌లో తాను పోటీ చేసేది లేనిది ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని ప్ర‌కాష్ రాజ్ పేర్కొన్నారు. కాగా ఇటీవ‌లే జిన్నా సినిమాతో మంచు విష్ణు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీతో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

IPL_Entry_Point

టాపిక్