Pawan Kalyan: మేనల్లుడితో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్...
మెగా మామాఅల్లుళ్లు పవన్ కళ్యాణ్,సాయిధరమ్‌తేజ్ తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తమిళ చిత్రం వినోదయ సీతమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందంటే...
రాజకీయాలపై దృష్టిసారిస్తూనే సినిమాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు పవన్‌కళ్యాణ్(pawan kalyan). ప్రస్తుతం పవన్ హరిహరవీరమల్లు(harihara veera mallu) సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమాను సెట్స్పైకితీసుకొచ్చాడు. వినోధయసీతమ్ తమిళ రీమేక్ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్(saidharam tej) మరో హీరోగా నటిస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిసింది. సింపుల్‌గా ఈ వేడుకను జరిపినట్లు సమాచారం. ఈ పూజా కార్యక్రమాల్లో పవన్‌కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ కథాంశంతో ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఓ ప్రమాదంలో మరణించిన వ్యక్తి దేవుడి వరంతో తిరిగి జీవితాన్ని పొంది మూడు నెలల్లో తన బాధ్యతల్ని ఎలా నెరవేర్చాడనే పాయింట్‌తో సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిఫరెంట్ పాయింట్‌తో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా పలు మార్పులు చేస్తూ సముద్రఖని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. ఇందులో దేవుడి పాత్రలో పవన్‌కళ్యాణ్ కనిపించబోతున్నట్లు సమాచారం. భక్తుడిగా సాయిధరమ్‌తేజ్ నటిస్తున్నట్లు తెలిసింది.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇరవై రోజులు డేట్స్‌ను కేటాయించినట్లు చెబుతున్నారు. ఇందు కోసం యాభై కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకున్నట్లు తెలిసింది. జూలై తొలివారంలో ఈ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. జూలై నెలాఖరున పవన్ కళ్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు చెబుతున్నారు. జూలై ఎండింగ్ నుండి ఆగస్ట్ మిడిల్ వరకు ఆయన పాత్ర తాలూకు ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్