Jalsa Re Release Collection: రీ రిలీజ్ కలెక్షన్స్‌లో పోకిరి రికార్డులను బ్రేక్ చేసిన జల్సా
Jalsa Re Release Collection: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన జల్సా సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. రీ రిలీజ్ కలెక్షన్స్ లో పోకిరి రికార్డ్ లను బ్రేక్ చేసింది.
Jalsa Re Release Collection: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ మొదలైంది. ఈ కొత్త ట్రెండ్‌కు పోకిరి సినిమాతో మహేష్ బాబు శ్రీకారం చుట్టారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ అయిన పోకిరి నైజాం ఏరియాలో 69 లక్షల కలెక్షన్స్ సాధించింది. వరల్డ్ వైడ్ గా కోటిన్నర వసూళ్లను రాబట్టింది. తాజాగా పోకిరి నైజాం రికార్డులను పవన్ కళ్యాణ్ జల్సా సినిమా క్రాస్ చేసింది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 1న ఈ సినిమాను 4కే టెక్నాలజీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
రీ రిలీజ్ అయిన ప్రతి చోట సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కింది. వరల్డ్ వైడ్ గా 702కు సెంటర్స్ లో సినిమా ను రిలీజ్ చేశారు. అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ అయిన సినిమాగా నిలిచింది. శుక్రవారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2.80 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఏపీ తెలంగాణలో కలిపి 2.40 కోట్లు, అమెరికాలో 30 లక్షలు, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల్లో కలిపి మరో 10 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
నైజాంలో ఈ సినిమా 1.26 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా జల్సా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా పోకిరి రికార్డులను అధిగమించింది. జల్సా రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ను అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు అందజేయనున్నట్లు సమాచారం. జల్సా సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఇలియానా హీరోయిన్ గా నటించింది. 2008లో విడుదలైన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది.