Tholi Prema Re-release: తొలిప్రేమ రీ-రిలీజ్‍కు భారీ క్రేజ్.. టికెట్ బుకింగ్స్ ఓపెన్.. అప్పుడే కొన్ని షోలు ఫుల్!
Tholi Prema Re-release: తొలిప్రేమ సినిమా రీ-రిలీజ్‍కు భారీ క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో బుకింగ్స్ మొదలయ్యాయి. కొన్ని షోలు ఫుల్ కూడా అయ్యాయి.
Tholi Prema Re-release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ 25 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఈ క్లాసిక్ లవ్ సినిమాను వెండితెరపై చూసే అవకాశం అభిమానులకు మరోసారి వస్తోంది. జూన్ 30వ తేదీన మొత్తంగా 300 థియేటర్లలో తొలిప్రేమ చిత్రం 4కే ఫార్మాట్‍లో రీ-రిలీజ్ కానుంది. మాతా క్రియేషన్స్ ఈ రీ-రిలీజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా సిటీల్లోని థియేటర్లలో తొలిప్రేమ.. రీ-రిలీజ్ అవనుంది. ఈ తరుణంలో ఈ మూవీ రీ-రిలీజ్‍పై ఫుల్ క్రేజ్ నెలకొని ఉంది. తొలిప్రేమ మూవీని బిగ్ స్క్రీన్‍పై చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
తొలిప్రేమ రీ-రిలీజ్ టికెట్స్ బుకింగ్‍లు ఇప్పటికే కొన్ని సిటీల్లోని థియేటర్లకు ఓపెన్ అయ్యాయి. మరికొన్ని చోట్ల బుకింగ్ మొదలుకావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లోగా అన్ని సిటీల్లో టికెట్స్ బుకింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, హైదరాబాద్‍లో ఇప్పటికే కొన్ని థియేటర్లలో తొలిప్రేమ రీ-రిలీజ్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సంధ్యా 70ఎంఎం థియేటర్లో జూన్ 30న ఇప్పటికే రెండు షోలు ఫుల్ అయిపోయాయి. రీ-రిలీజ్‍కు ఐదు రోజుల ముందే ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే తొలిప్రేమ రీ-రిలీజ్‍కు క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని షోలు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో రెండు రోజుల్లోగా అన్ని సిటీల్లోని థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం కావొచ్చు.
మరోవైపు, హైదరాబాద్‍లోని సంధ్యా 70ఎంఎం థియేటర్ వద్ద తొలిప్రేమ రీ-రిలీజ్ సందడి ఐదు రోజుల ముందే షురూ అయింది. పవన్ కల్యాణ్ 50 అడుగుల భారీ కటౌట్‍ను ఆ థియేటర్ ముందు ఏర్పాటు చేశారు అభిమానులు. రీ-రిలీజ్‍ల్లో తొలిప్రేమ రికార్డులు బద్దలుకొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా 1998 సంవత్సరంలో వచ్చింది తొలిప్రేమ. 1998 జూన్ 24న విడుదలైంది. దీంతో తొలిప్రేమ చిత్రానికి శనివారమే 25ఏళ్లు పూర్తయ్యాయి. 25ఏళ్ల సంబరాల్లో భాగంగా ఈ చిత్రం జూన్ 30న రీ-రిలీజ్ అవుతోంది.
తొలిప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్‍కు జోడీగా కీర్తి రెడ్డి నటించింది. ఈ సినిమాకు ఆమె మరో హైలైట్‍గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవ.. సంగీతం తొలిప్రేమకు మరో బలమైన అంశంగా నిలిచింది.