Rakshit Atluri: నా సినిమా చూడకుండా ఎలా నటించగలనని అనుకున్నావ్: పలాస హీరో రక్షిత్ కామెంట్స్-palasa fame rakshit atluri comments on sasivadane director sai mohan ubbana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakshit Atluri: నా సినిమా చూడకుండా ఎలా నటించగలనని అనుకున్నావ్: పలాస హీరో రక్షిత్ కామెంట్స్

Rakshit Atluri: నా సినిమా చూడకుండా ఎలా నటించగలనని అనుకున్నావ్: పలాస హీరో రక్షిత్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 22, 2024 07:26 AM IST

Rakshit Atluri About Sasivadane Director: పలాస 1978 హీరో రక్షిత్ అట్లూరి నటించిన కొత్త సినిమా శశివదనే. కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. తాజాగా నిర్వహించిన శశివదనే ప్రెస్ మీట్‌లో హీరో రక్షిత్ అట్లూరి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

నా సినిమా చూడకుండా ఎలా నటించగలనని అనుకున్నావ్: పలాస హీరో రక్షిత్ కామెంట్స్
నా సినిమా చూడకుండా ఎలా నటించగలనని అనుకున్నావ్: పలాస హీరో రక్షిత్ కామెంట్స్

Rakshit Atluri Sasivadane: పలాస 1978 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఇప్పుడు రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా శశివదనే. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ సినిమాను గౌరీ నాయుడు సమర్పిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వ‌హించారు.

శశివదనే సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా శశివదనే టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో రక్షిత్ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "శశివదనే సినిమాను ఏప్రిల్ 5న కాకుండా ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నాం. ఎందుకు వాయిదా వేశామనేది మా దర్శకుడు చెప్పారు. సినిమా ఫస్ట్ కాపీ చూసుకుని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మూవీ చాలా బ్రహ్మాండంగా వచ్చింది" అని హీరో రక్షిత్ శెట్టి నమ్మకంగా చెప్పాడు.

"దర్శకుడు సాయి మోహన్ కథ చెప్పిన విధానం నాకు ముందు అర్థం కాలేదు. అప్పుడు నేను తనని నువ్వు పలాస సినిమా చూశావా అని అడిగాను. దానికి తను లేదు సార్ అన్నాడు. పలాస మూవీ చూడకుండా నేను ఈ చిత్రంలో ఎలా పెర్ఫామ్ చేయగలను అనుకున్నావ్ అని అడిగాను. రాత్రికి సినిమా చూసి మాట్లాడుతానని అన్నాడు. అలా మా జర్నీ ప్రారంభమైంది. హను రాఘవపూడి గారి దగ్గర సాయి వర్క్ చేశాడు. తను కూడా హను గారంత పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రక్షిత్ అట్లూరి తెలిపాడు.

"అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ఎమోషన్‌తో పాటు తండ్రి ఎమోషన్‌ని సాయి ముందుగా రాసుకున్నాడు. పలాస కంటే శశివదనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అవుతుందని నమ్మకంగా ఉన్నాను. అలాగే డైరెక్టర్ రాసుకున్న కథను బ్రహ్మాండంగా మా సినిమాటోగ్రాఫర్ సాయికుమార్ దారి విజువలైజ్ చేసి, అద్భుతంగా చూపించారు. తను పెద్ద సినిమాటోగ్రాఫర్ అవుతాడు. శరవణన్ మంచి పాటలను ఇచ్చారు. అలాగే అనుదీప్ గారు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జెడి మాస్టర్ క్యూట్‌‌గా కొరియోగ్రఫీ చేశారు" అని రక్షిత్ అట్లూరి చెప్పుకొచ్చాడు.

"రాఘవ అనే పాత్రలో నేను బాగా నటించటానికి కారణం శశి పాత్రలో అద్భుతంగా చేసిన కోమలిగారే. ఈ సినిమాలో నన్ను చూసినట్లు వేరే సినిమాలో కనిపించలేదు. క్లైమాక్స్ విషయానికి వస్తే.. నాది, కోమలిగారి పెర్ఫామెన్స్ చూస్తే మీరే గొప్పగా ఉందని చెబుతారు. శశివదనే మూవీ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. మా నిర్మాతలు తేజ, గౌరి, అభిలాష్ గారు చాలా కష్టపడ్డారు. ఏప్రిల్ 19న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ మా టీమ్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అని హీరో రక్షిత్ అట్లూరి తన స్పీచ్ ముగించాడు.

"హీరో హీరోయిన్లుగా నటించిన రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్‌లకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతలు అహితేజ, అభిలాష్ గారికి, దర్శకుడు సాయి మోహన్ గారికి థాంక్స్. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీమ్ అందరూ వర్క్ చేసిన బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. సినిమా అందరికీ నచ్చుతుంది" అని కొరియోగ్రాఫర్ జెడి మాస్టర్ తెలిపారు.