pakka commercial: పక్కా కమర్షియల్ టీమ్ డేరింగ్ డెసిషన్...మల్టీపెక్స్ లలో యాభై శాతం టికెట్ల ధరల తగ్గింపు
గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ చిత్ర యూనిట్ నిర్ణయాన్ని తీసుకున్నది.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలపై సగటు సినీ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టికెట్ల ధరలు అధికంగా ఉండటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. అధిక ధరలు ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుండటంతో టికెట్ల రేట్లను తగ్గిస్తూ దర్శకనిర్మాతలు తమ సినిమాల్ని విడుదలచేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు మల్టీప్లెక్స్ లలో 300, సింగిల్ స్క్రీన్స్‌లో 250 వరకు ఉన్నాయి. ఇటీవల విడుదలైన మేజర్‌తో పాటు పలు సినిమాల టికెట్ల ధరలు వంద రూపాయల వరకు తగ్గించి రిలీజ్ చేశారు. తాజాగా పక్కా కమర్షియల్ టీమ్ మరో అడుగు ముందుకు వేసింది. మల్టీప్లెక్స్‌లలో శాతం మేర టికెట్ల ధరలను తగ్గించింది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. జూలై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఈ సినిమా టికెట్ల ధరలను తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో 160 గా నిర్ణయించారు.. ఏపీలోని మల్టీప్లెక్స్‌లలో 150, సింగిల్ స్ర్కీన్స్లలో 100 రూపాయలుగా ఖరారు చేసినట్లు తెలిసింది. కోర్ట్ రూమ్ డ్రామాకు వినోదాన్ని జోడిస్తూ మారుతి ఈ సినిమాను తెరకెక్కించారు. కెరీర్లో తొలిసారి గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
టాపిక్