OTT Thriller Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్-ott thriller movies cellar door never let go streaming on prime video in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్

OTT Thriller Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్

Hari Prasad S HT Telugu
Dec 03, 2024 12:12 PM IST

OTT Thriller Movies: ఒకే ఓటీటీలోకి ఒకే రోజు థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ జానర్లకు చెందిన రెండు సినిమాలు తెలుగులో అందుబాటులోకి రావడం విశేషం. అయితే ఈ రెండు మూవీస్ ని కూడా రెంట్ విధానంలోనే చూసే అవకాశం ఉంది.

ఒకే రోజు ఒకే ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్
ఒకే రోజు ఒకే ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్

OTT Thriller Movies: ఓటీటీలోకి కొత్తగా ఓ థ్రిల్లర్, మరో హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వచ్చాయి. ఈ రెండు అమెరికన్ మూవీస్ కూడా ఒకే ఓటీటీలో అడుగుపెట్టాయి. ఇందులో ఒకటి థ్రిల్లర్ మూవీ సెల్లార్ డోర్ కాగా.. మరొకటి సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ నెవర్ లెట్ గో. ఈ రెండు సినిమాలు తెలుగుతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి.

yearly horoscope entry point

సెల్లార్ డోర్ ఓటీటీ స్ట్రీమింగ్

సెల్లార్ డోర్ ఓ అమెరికన్ థ్రిల్లర్ మూవీ. గత నెల 1న థియేటర్లలో రిలీజైంది. నెల రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లోనూ చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి రెంట్ విధానంలోనే ఈ సినిమా వచ్చింది. రూ.149 చెల్లించి హెచ్‌డీ క్వాలిటీలో ఈ థ్రిల్లర్ మూవీ చూడొచ్చు.

వాన్ స్టీన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జోర్డానా బ్రూస్టర్, స్కాట్ స్పీడ్‌మ్యాన్, లారెన్స్ ఫిష్‌బర్న్ లాంటి వాళ్లు నటించారు. ఓ ధనికుడు ఓ జంటకు తన అందమైన ఎస్టేట్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. అక్కడికి వెళ్లి తమ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలనుకున్న ఆ జంటకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అందులోని సెల్లార్ డోర్ ను మాత్రం తెరవకూడని పరిస్థితి నెలకొంటుంది. అందులో ఏముంది? ఆ ఎస్టేట్ కు వెళ్లిన ఆ జంటకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

నెవర్ లెట్ గో ఓటీటీ స్ట్రీమింగ్

ఇక ప్రైమ్ వీడియోలోకే తెలుగులో అందుబాటులో వచ్చిన మరో అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ నెవర్ లెట్ గో. ఈ సినిమాను కూడా ప్రైమ్ వీడియోలో రెంట్ చెల్లించి చూడొచ్చు. అలెగ్జాండ్రా అజా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హాలె బెర్రీ, పెర్సీ డాగ్స్, ఆంథోనీ జెన్కిన్స్, విల్ కార్లెట్ లాంటి వాళ్లు నటించారు. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ అడవిలో జీవిస్తుంటుంది.

ది ఈవిల్ అనే ఓ అతీత శక్తి ప్రపంచాన్నంతటినీ మింగేసిందని, తాము మాత్రం మిగిలి ఉన్నామంటూ తన పిల్లలకు ఆ తల్లి చెబుతుంది. అయితే పిల్లల్లో ఒకరికి అసలు దెయ్యం నిజమేనా అన్న సందేహం కలుగుతుంది. అది చివరికి ఆ కుటుంబాన్ని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టేసిందన్నది ఈ నెవర్ లెట్ గో మూవీలో చూడొచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.

Whats_app_banner