OTT Romantic Movie: నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott romantic movie tamil dubbed telugu teenage love story satya to stream on aha video from september 7th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Movie: నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Romantic Movie: నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

OTT Romantic Movie: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత ఓ తెలుగు రొమాంటిక్ మూవీ రాబోతోంది. నిజానికి తమిళ డబ్బింగ్ మూవీ అయినా ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వారమే డిజిటల్ ప్రీమియర్ కు మూవీ సిద్ధమైంది.

నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Romantic Movie: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ టీనేజీ లవ్ స్టోరీ రానుంది. ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న ఈ సినిమా పేరు సత్య. మే 10న థియేటర్లలో రిలీజైన ఈ తమిళ డబ్బింగ్ మూవీ.. నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఈ విసయాన్ని ఆహా ఓటీటీ సోమవారం (సెప్టెంబర్ 2) తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది.

సత్య ఓటీటీ రిలీజ్ డేట్

26 ఏళ్ల కిందట వచ్చి సంచలన విజయం సాధించిన గ్యాంగ్‌స్టర్ మూవీ సత్య తెలుసు కదా. కొన్నాళ్ల కిందట అదే పేరుతో తెలుగులో మరో సినిమా వచ్చింది. అయితే ఇది దానికి పూర్తి భిన్నమైన జానర్ టీనేజీ లవ్ స్టోరీ కావడం విశేషం. తమిళంలో రంగోలి పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో సత్యగా రిలీజ్ చేశారు.

ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా సదరు ఓటీటీ వెల్లడించింది. "మన స్కూల్ లైఫ్ కనిపిస్తుంది.. సత్య సెప్టెంబర్ 7 నుంచి మీ ఆహాలో.." అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.

సత్య మూవీ కథేంటి?

సత్య మూవీని తెలుగులోకి శివ మల్లాల తీసుకొచ్చాడు. వాలీ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హమరేశ్, ప్రార్థన సందీప్, మురగదాస్, సాయిశ్రీ నటించారు. మే 10న తెలుగులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. అంతకుముందే తమిళంలో మంచి హిట్ కావడంతో చిన్న సినిమానే అయినా తెలుగులోనూ తీసుకొచ్చారు. ఫొటో జర్నలిస్టు అయిన శివ మల్లాల తెలుగులో సత్య పేరుతో మూవీని రిలీజ్ చేశాడు.

సత్య మూవీ ఓ టీనేజీ లవ్ స్టోరీ. ఇష్టం లేక తండ్రి కోరిక మేరకు ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదవడానికి వెళ్లే సత్య.. అక్కడ పార్వతి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతున్నా బయటకు మాత్రం చెప్పదు. కానీ అనూహ్యంగా ఓ రోజు అతన్నే చెంపదెబ్బ కొడుతుంది. దీంతో అతడు ఆ కాలేజీని వదిలేసి తన కుటుంబం కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అసలు ఆ నిర్ణయం ఏంటి? తర్వాత ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఏమవుతుంది అన్నదే సత్య మూవీ కథ.

ఈ టీనేజీ లవ్ స్టోరీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనూ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు వచ్చే శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి సందర్భంగా ఆహా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.