OTT Action Drama: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ-ott action drama movie vijay antony toofan now streaming in telugu on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Drama: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Action Drama: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Aug 23, 2024 12:30 PM IST

OTT Action Drama: థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా నిజానికి తమిళంలో గత వారమే ఓటీటీలోకి రాగా.. తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Action Drama: తమిళ యాక్షన్ డ్రామా మళై పిడిక్కత మణితన్ ఈ మధ్యే రిలీజైన మూవీ. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా తెలుగులో తూఫాన్ పేరుతో రిలీజైంది. అయితే థియేటర్లలో డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. ఆగస్ట్ 11న రిలీజైన ఈ మూవీ.. రెండు వారాలు కూడా పూర్తి కాక ముందే ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.

ఓటీటీలోకి తూఫాన్

విజయ్ ఆంటోనీ నటించిన తమిళ యాక్షన్ డ్రామా తూఫాన్ గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో రిలీజైంది. అయితే తాజాగా శుక్రవారం (ఆగస్ట్ 23) నుంచి ఈ సినిమా అదే ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో ఆగస్ట్ 11న తెలుగులో రిలీజైన ఈ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటీటీలో ఎంత వరకూ ఆదరిస్తారన్నది కూడా అనుమానమే. ఈ ఏడాది విజ‌య్ ఆంటోనీకి ఇది రెండో డిజాస్ట‌ర్‌. అత‌డి గ‌త మూవీ రోమియో కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

తూఫాన్ స్టోరీ ఏంటంటే?

తుఫాన్ మూవీకి విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో శ‌ర‌త్‌కుమార్‌, స‌త్య‌రాజ్, డాలీ ధ‌నుంజ‌య‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ యాక్ష‌న్ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. విజ‌య్ ఆంటోనీతో పాటు అచ్చు రాజ‌మ‌ణి, రాయ్‌, హ‌రీ ద‌ఫుసీయా, వ‌గు మ‌జ‌న్ మ్యూజిక్ అందించారు.

హాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన ప‌లు యాక్ష‌న్ సినిమాల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు విజ‌య్ మిల్ట‌న్ తుఫాన్ మూవీ క‌థ‌ను రాసుకున్నాడు. కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో తుఫాన్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

స‌లీం ( విజ‌య్ ఆంటోనీ) ఓ సీక్రెట్ ఏజెంట్‌. త‌న బాస్ (శ‌ర‌త్ కుమార్‌) అప్ప‌గించిన ఆప‌రేష‌న్ కోసం అండ‌మాన్ దీవుల్లోని ఓ ఊరికి వ‌స్తాడు. ఆ ఊరిలో డాలీ (డాలీ ధ‌నుంజ‌య‌) అనే వ‌డ్డీ వ్యాపారి చెప్పిందే వేదం. అత‌డి కార‌ణంగా ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటారు. వారిలో సౌమ్య(మేఘా ఆకాష్‌) కూడా ఉంటుంది. సౌమ్య‌తో స‌లీమ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది?

డాలీ బారి నుంచి ఆ ఊరి ప్ర‌జ‌ల‌ను స‌లీమ్ ఎలా కాపాడాడు? సౌమ్య కంటే ముందే స‌లీమ్ జీవితంలో ఉన్న మ‌రో అమ్మాయి ఎవ‌రు? ఆమె ఎలా ప్రాణాల‌ను కోల్పోయింది? అస‌లు స‌లీమ్...అండ‌మాన్‌కు ఎందుకొచ్చాడు? ఈ క‌థ‌లో కెప్టెన్ (స‌త్య‌రాజ్‌) పాత్ర ఏమిట‌నే పాయింట్‌తో డైరెక్ట‌ర్ విజ‌య్ మిల్ట‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.