Chellow Show Child Actor Died: ఛెల్లో షో సినిమా బాల నటుడు కన్నుమూత.. విడుదలకు ముందే విషాదం-oscar nominated movie chhello show child actor rahul koli passed away ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chellow Show Child Actor Died: ఛెల్లో షో సినిమా బాల నటుడు కన్నుమూత.. విడుదలకు ముందే విషాదం

Chellow Show Child Actor Died: ఛెల్లో షో సినిమా బాల నటుడు కన్నుమూత.. విడుదలకు ముందే విషాదం

Maragani Govardhan HT Telugu
Oct 11, 2022 01:55 PM IST

Chellow Show Child Actor Died: ఛెల్లో షోలో బాలనటుడిగా నటించిన రాహుల్ కోలీ కన్నుమూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న రాహుల్ తుదిశ్వాస విడిచారు. ఈ సినిమా మరో మూడు రోజుల్లో విడుదవుతుండటం విశేషం.

<p>ఛెల్లో షో బాలనటుడి మృతి&nbsp;</p>
ఛెల్లో షో బాలనటుడి మృతి (Twitter)

Chellow Show Child Actor Rahul Koli Passed Away: ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ లాంటి పెద్ద చిత్రాలను వెనక్కి నెట్టి.. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఛెల్లో షో(The Lost Show) సినిమా ఇటీవల కాలంలో బాగా వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో నటించిన బాల నటుడు రాహుల్ కోలీ(15) కన్నుమూశాడు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రాహుల్ తుదిశ్వాస విడిచాడు. చెల్లో షో చిత్రం ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే విడుదలకు ముందే రాహుల్ మరణించడంతో చిత్రబృందం పాటు రాహుల్ కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల కాలంలో తరచూ జ్వరం బారిన పడుతున్న రాహుల్.. రీసెంట్ రక్తపు వాంతులు కూడా చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాము వాపోయారు. అక్టోబరు 2న ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. సోమవారం నాడు రాహుల్ సొంత గ్రామమైన జామానగర్‌లో అతడి కుటుంబం సంతాప సభ నిర్వహించారు.

సినిమాలపై ఎంతో ఇష్టం కలిగిన తొమ్మిదేళ్ల యువకుడి జీవితం ఎలా సాగిందనే నేపథ్యంతో ఛెల్లో షో సినిమా సాగుతుంది. ఇందులో మొత్తం ఆరుగురు పిల్లలు నటించగా.. వారిలో రాహుల్ కోలీ ఒకడు. అతడి మృతి పట్ల పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో(Chhello Show)’ 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 95వ అకాడమీ అవార్డుల్లో భారతీయ అధికారిక ఎంట్రీ గా ‘ఛెల్లో షో(Chhello Show) ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా((FFI)) ప్రకటించింది. ఇంగ్లీష్ లో ఈ మూవీకి "Last Film Show" అనే పేరు పెట్టారు. ఇది భారత్ లోని థీయేటర్లలో దేశవ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం