Simhadri Re Release Date: రీ రిలీజ్‌కు రెడీ అయిన‌ ఎన్టీఆర్‌, రాజ‌మౌళి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ - డేట్ ఇదే-ntr rajamouli simhadri to re release in theatres on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Rajamouli Simhadri To Re Release In Theatres On This Date

Simhadri Re Release Date: రీ రిలీజ్‌కు రెడీ అయిన‌ ఎన్టీఆర్‌, రాజ‌మౌళి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ - డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Mar 31, 2023 06:20 AM IST

Simhadri Re Release Date: ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన సూప‌ర్ హిట్ మూవీ సింహాద్రి మ‌రోసారి థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

సింహాద్రి
సింహాద్రి

Simhadri Re Release Date: ఎన్టీఆర్ (Ntr) హీరోగా న‌టించిన సింహాద్రి సినిమా 20 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ స‌క్సెస్ త‌ర్వాత ఎన్టీఆర్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో 2003లో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌ను తిరుగులేని మాస్ హీరోగా నిల‌బెట్టిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ రిలీజ్ కానుంది.

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం 4 కే టెక్నాల‌జీ, డాల్బీ డిజిట‌ల్ 5.1 ప‌నుల‌ను పూర్తిచేసే ప‌నిలో నిర్మాత‌లు ఉన్నారు. ఇండియాతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో ప‌లు థియేట‌ర్ల‌లో ఈ సినిమా రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ క్రేజ్ నేప‌థ్యంలో సింహాద్రి రీ రిలీజ్‌లోనూ భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సింహాద్రి సినిమా 25 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 2003 ఇయ‌ర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

సింహాద్రి సినిమా లో భూమిక‌, అంకిత హీరోయిన్లుగా న‌టించారు. ఇందులో సింహాద్రిగా, సింగ‌మ‌లైగా డ్యూయ‌ల్ షేడ్ రోల్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ న‌టించాడు. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ స్పెష‌న‌ల్ సాంగ్‌లో న‌టించింది.

IPL_Entry_Point

టాపిక్