NTR | ఆచార్య మిక్స్‌డ్‌టాక్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఆందోళన
ఆచార్య మిక్స్‌డ్‌టాక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో భయాలు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య తర్వాత ఎన్టీఆర్‌తో దర్శకుడు కొరటాల శివ సినిమా చేయనున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ పునరాలోచిస్తే మంచిందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…
చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య చిత్రం తొలి ఆట నుంచే డివైడ్ టాక్ ను తెచ్చుకున్నది. ఈ సినిమా రిజల్ట్ వెలువడటమే ఆలస్యం సోషల్‌మీడియాలో ఎన్టీఆర్30 హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై భయాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్30ని ఉద్దేశించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్యకు ఎన్టీఆర్30 ఉన్న సంబంధం ఏమిటంటే...రెండింటికి కొరటాల శివ దర్శకుడు.
మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు వరుసగా భారీ హిట్స్ అందుకుంటూ వచ్చాడు కొరటాల శివ. కమర్షియల్ అంశాలతో పాటు ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్‌ను చూపిస్తూ దర్శకుడిగా తనకంటూ సొంత మార్కును క్రియేట్ చేసుకున్నాడు. కొరటాల శివపై ఉన్న ఆ నమ్మకంతోనే అతడితో ఆచార్య సినిమా చేశారు చిరంజీవి, చరణ్. కానీ ఆ నమ్మకాన్ని దర్శకుడు పూర్తిగా నిలబెట్టలేకపోయారని మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. కథ, కథనాలతో పాటు చిరు, చరణ్ క్యారెక్టరైజేషన్స్‌ను సరిగా చూపించలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచిందని చెబుతున్నారు.
ఆచార్య రిజల్ట్ చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ 30ని కొరటాల శివ ఎలా తెరకెక్కిస్తాడో అంటూ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు కొరటాలతో సినిమా విషయంలో ఎన్టీఆర్ పునరాలోచిస్తే బాగుంటుందని ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య సినిమాలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీమ్‌కు సూచిస్తున్నారు. మరికొందరైతే కొరటాల శివ సినిమాను పక్కనపెట్టి త్రివిక్రమ్ చిత్రాన్ని ఎన్టీఆర్ మొదలుపెట్టడం బెటర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క దెబ్బతో ఇన్నాళ్లు నిలబెట్టుకున్న నమ్మకాన్ని కొరటాల శివ మొత్తం పోగొట్టుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు.
అభిమానుల సూచనల్ని ఎన్టీఆర్ 30 టీమ్ పరిగణనలోకి తీసుకుంటుందా? ఆచార్య ప్రభావం నిజంగానే ఈ సినిమా పై ఉంటుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఎన్టీఆర్‌కు ఫైనల్ స్ర్కిప్ట్‌ను వినిపించానని కొరటాల శివ చెప్పారు. మే లేదా జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
సంబంధిత కథనం