18 Pages Third Single Release Date: 18 పేజీస్ నుంచి మరో పాటకు ముహూర్తం ఫిక్స్-nikhil siddhartha starred 18 pages third single release date fix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  18 Pages Third Single Release Date: 18 పేజీస్ నుంచి మరో పాటకు ముహూర్తం ఫిక్స్

18 Pages Third Single Release Date: 18 పేజీస్ నుంచి మరో పాటకు ముహూర్తం ఫిక్స్

Maragani Govardhan HT Telugu
Dec 09, 2022 07:29 PM IST

18 Pages Third Single Release Date: నిఖిల్ హీరోగా నటించిన 18 పేజీస్ నుంచి మరో పాటకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ పాటను డిసెంబరు 11న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

18 పేజీస్ నుంచి మరో పాట విడుదల
18 పేజీస్ నుంచి మరో పాట విడుదల

18 Pages Third Single Release Date: కార్తికేయ చిత్రంతో మంచి జోరుమీదున్నాడు టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. ఈ ఏడాది ఈ చిత్రం పాన్ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్ని అందుకోవడంతో నిఖిల్ తన తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో ఉండేలా, కథల ఎంపికపై దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం 18 పేజీస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, రెండు పాటలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ చిత్రం నుంచి మరో పాట విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

18 పేజీస్ చిత్రం నుంచి ఏడు రంగుల వాన అనే పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. డిసెంబరు 11 అంటే ఆదివారం నాడు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఇటీవలే విడుదలైన నన్నయ రాసిన, కొంచెం టైం ఇవ్వు పిల్ల అనే రొమాంటిక్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో పాట కూడా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ థర్డ్ సాంగ్ ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు. దీంతో పాట పక్కాగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీమణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

నిఖిల్ సరసన ఈ చిత్రం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది. కార్తికేయ 2తో సక్సెస్‌ఫుల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ 18 పేజీస్‌తో మరోసారి అలరించనున్నారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. పల్నాటీ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ఇండియా దర్శకులు సుకుమార్ కథను అందించారు. డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్