Time ivvu pilla from 18 Pages: "టైమ్ ఇవ్వు పిల్ల" అంటున్న నిఖిల్.. 18 పేజెస్ నుంచి సూపర్ సాంగ్
Time ivvu pilla from 18 Pages: "టైమ్ ఇవ్వు పిల్ల" అంటూ 18 పేజెస్ నుంచి వచ్చిన లిరికల్ సాంగ్ ఎంతో లైవ్లీగా ఉంది. బ్రేకప్ తర్వాత బాధలో నిఖిల్ పాడుకునే ఈ పాట నయా దేవదాసులను అట్రాక్ట్ చేసేలా ఉంది.
Time ivvu pilla from 18 Pages: కార్తికేయ 2 మూవీ తర్వాత నిఖిల్ చేస్తున్న సినిమా 18 పేజెస్. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఇప్పుడు షూటింగ్ ముగింపుకు చేరుకోవడంతో మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్లు మొదలుపెట్టింది. అందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 5) టైమ్ ఇవ్వు పిల్ల అనే ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది.
యూత్ మెచ్చేలా ఉన్న ఈ బ్రేకప్ సాంగ్ ఫన్నీ లిరిక్స్‌తో సాగుతుంది. ఈ రోజుల్లో ఒకరికి బ్రేకప్ చెప్పి.. ఆ వెంటనే మరొకరితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం కామనైపోయింది. అలాంటి అమ్మాయిలను బ్లేమ్ చేస్తూ రాసిన పాట ఇది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంటూ యూత్ ఎక్కువగా వాడే సోషల్ మీడియా పేర్లను లిరిక్స్‌లో వాడుతూ వాళ్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు.
తమిళ స్టార్ హీరో శింబు ఈ పాట పాడటం విశేషం. గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. రొటీన్ పాటలకు కాస్త భిన్నమైన ట్యూన్‌తో చాలా లైవ్లీగా ఈ పాట సాగుతుంది. హీరోకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి.. మరుసటి రోజే మరొకరితో రిలేషన్‌షిప్‌లో మునిగిపోయి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పబ్లిగ్గా చెబుతుంటే చూసి తట్టుకోలేని హీరో బాధతో పాడే పాట ఇది.
నిఖిల్ ఎక్స్‌ప్రెషన్స్, శింబు వాయిస్ ఈ పాట పెద్ద ప్లస్ పాయింట్స్. కచ్చితంగా ఈ కాలం యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించడం విశేషం. ఈ మూవీకి అతడే ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.