Newsense OTT Release: న్యూసెన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?-newsense web series ott release date fix when and where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Newsense Ott Release: న్యూసెన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Newsense OTT Release: న్యూసెన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
May 06, 2023 10:09 PM IST

Newsense OTT Release: బిందుమాధవి, నవ్‌దీప్ ప్రధాన పాత్రల్లో నటించిన న్యూసెన్స్ ట్రైలర్ శనివారం విడుదలైంది. అంతేకాకుండా ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ నెల 12న సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

న్యూసెన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
న్యూసెన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Newsense OTT Release: బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి(Bindu Madhavi).. టాలీవుడ్ నటుడు నవదీప్(Navdeep) కలిసి నటించిన వెబ్‌సిరీస్ న్యూసెన్స్(Newsense). ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్‌ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో కూడా తెలియజేశారు.

న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఈ నెల 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా ఈ సిరీస్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. నేటి మీడియా ఎక్కువగా దేనికి ప్రభావితమవుతోంది? డబ్బుకు మీడియా దాసోహమా? లాంటి ప్రశ్నలను ఉత్పన్నమయ్యేలా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మే 12 నుంచి విడుదల కానుంది.

ట్రైలర్‌ను గమనిస్తే ఇక్కడ ఎవడి సొమ్ము ఎవడూ తినడం లేదు.. ఎవడి దమ్ము వాడిదే లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మీడియా రంగాన్ని ఉద్దేశించి ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేటి మీడియా రంగం డబ్బుకు ఎలా ప్రభావితమవుతోంది ఇందులో చూపించినట్లు సమాచారం.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శ్రీ ప్రవణ్ కుమార్ దర్శకత్వం వహించారు. నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో కలిసి నటించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సామాజిక అంశాలను కూడా ఇందులో స్పృశించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Whats_app_banner