Naresh on Mahesh Babu: పవిత్రతో నా రిలేషన్‌ను మహేష్ అంగీకరించాడు..! నరేష్ షాకింగ్ కామెంట్స్-naresh says mahesh babu accepted my relationship with pavitra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naresh On Mahesh Babu: పవిత్రతో నా రిలేషన్‌ను మహేష్ అంగీకరించాడు..! నరేష్ షాకింగ్ కామెంట్స్

Naresh on Mahesh Babu: పవిత్రతో నా రిలేషన్‌ను మహేష్ అంగీకరించాడు..! నరేష్ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
May 21, 2023 04:37 PM IST

Naresh on Mahesh Babu: ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌తో నరేష్ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమ బంధాన్ని తన సవతి సోదరుడు మహేష్ బాబు అంగీకరించినట్లు స్పష్టం చేశారు. పవిత్ర తన వంట నైపుణ్యంతో మహేష్‌తో సహా ఇతర కుటుంబ సభ్యుల ప్రశంసలను అందుకుందని తెలిపారు.

పవిత్రా లోకేష్‌తో నరేష్ రిలేషన్‌ను మహేష్ బాబు ఒప్పుకున్నారా?
పవిత్రా లోకేష్‌తో నరేష్ రిలేషన్‌ను మహేష్ బాబు ఒప్పుకున్నారా?

Naresh on Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు తండ్రి అలనాటి సూపర్ స్టార్ కృష్ణ.. నరేష్ తల్లి విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి కృష్ణ ఫ్యామిలీలో ఒకరిగా నరేష్ ఉంటున్నారు. మహేష్ బాబుతో పాటు అతడి కుటుంబంతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌షిప్, అతడి మూడో భార్య రమ్య రఘుపతితో వివాదంలో నరేష్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఎలా స్పందించారనేది ఆసక్తికరంగా మారింది.

పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తూ నరేష్ ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఆమెను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. అంతేకాకుండా వీరిద్దరూ ఎంఎస్ రాజు దర్శకత్వంలో మళ్లీ పెళ్లీ అనే సినిమా కూడా చేశారు. ఓల్డేజ్ లవ్ స్టోరీనే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు. మహేష్ బాబుతో వీరి సంబంధంపై ఎలా స్పందించారనే విషయంపై నరేష్ మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులందరికీ ఈ పెళ్లి అంగీకారమేనని బదులిచ్చారు.

అంతేకాకుండా పవిత్రా లోకేష్ తన కుటుంబ సభ్యులందరికీ చక్కగా వండిపెట్టి తన కుక్కింగ్ స్కిల్స్‌తో అందరి ప్రశంసలను అందుకున్నట్లు నరేష్ చెప్పారు. ఇందుకు తన సవతి సోదరుడైన మహేష్, ఇతర కుటుంబ సభ్యులు కూడా సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు. తమ రిలేషన్‌ను మహేష్ సహా కుటుంబ సభ్యులందరూ అంగీకరించినట్లు పేర్కొన్నారు. మరి నరేష్ చెప్పినట్లు ఆయన రిలేషన్‌షిప్‌ను మహేష్ బాబు కుటుంబ సభ్యులు నిజంగా ఒప్పుకున్నారా? లేదా? అనేది చూడాలి.

ప్రస్తుతం నరేష్-పవిత్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మళ్లీ పెళ్లి విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. సురేష్ బొబ్బిలితో పాటు అరుల్ దేవ్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఏకకాలంలో సినిమాను విడుదల చేయనున్నారు. మళ్లీ పెళ్లి చిత్రాన్ని ఈ వేసవి కానుకగా మే 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

Whats_app_banner