Mukesh Khanna on Adipurush: “అది కూడా తెలియదా?”: ఆదిపురుష్ టీమ్‍పై ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఆగ్రహం-mukesh khanna fires on adipurush team said the movie team to be burn ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mukesh Khanna On Adipurush: “అది కూడా తెలియదా?”: ఆదిపురుష్ టీమ్‍పై ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఆగ్రహం

Mukesh Khanna on Adipurush: “అది కూడా తెలియదా?”: ఆదిపురుష్ టీమ్‍పై ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఆగ్రహం

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 21, 2023 06:13 PM IST

Mukesh Khanna on Adipurush: ఆదిపురుష్ టీమ్‍పై ప్రముఖ నటుడు ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రావణుడికి శివుడు ఏ వరమిచ్చాడో కూడా ఆదిపురుష్ టీమ్‍కు తెలియదా అని ప్రశ్నించాడు.

ముకేశ్ ఖన్నా
ముకేశ్ ఖన్నా

Mukesh Khanna on Adipurush: ఆదిపురుష్ సినిమాపై నానాటికీ విమర్శలు అధికమవుతున్నాయి. ఈ సినిమాలోని డైలాగ్‍లు, గ్రాఫిక్స్‌, పాత్రల వేషధారణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రామాయణాన్ని ఈ మూవీలో వక్రీకరించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్‌ శుక్లాపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రముఖ నటుడు, శక్తిమాన్‍‌గా ప్రసిద్ధి చెందిన ముకేశ్ ఖన్నా.. ఆదిపురుష్ టీమ్‍పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మన గ్రంథాలను అవమానించే హక్కు ఎవరు ఇచ్చారంటూ ఓం రౌత్, మనోజ్ శుక్లాపై ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు రామాయణం చదివారా అంటూ తన యూట్యూబ్ ఛానెల్‍లో ప్రశ్నించాడు. రావణుడు ఏ వరం పొందాడో కూడా తెలియదా అని ఆదిపురుష్ దర్శకుడు, రచయితను నిలదీశాడు. ఇదే విషయాన్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతోనూ మాట్లాడాడు. రామాయణంతో భయకమైన జోక్ చేశారని విమర్శించాడు. “మన పురాణాలను అవమానించే హక్కు ఎవరిచ్చారు?. వారిద్దరూ (ఓం రౌత్, మనోజ్ ముంతాషిర్) కనీసం రామాయణాన్ని చదవలేదని నేను చెప్పా. రావణుడు ఏ వరం పొందాడో కూడా వారికి తెలియదు. హిరణ్య కష్యపుడి వరాన్ని రావణుడికి ఆపాదించారు” అని ముకేశ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

“రావణుడికి శివుడు ఏ వరం ఇచ్చాడో కూడా వారికి తెలియదు. కానీ చాలా మాట్లాడుతున్నారు. వారిని కచ్చితంగా క్షమించకూడదు. యాభై డిగ్రీల సెల్సియస్‍లో నిలబెట్టి మొత్తం టీమ్‍ను కాల్చాలని నేను నిన్న నా యూట్యూబ్ ఛానెల్‍లో అన్నాను” అని ఏఎన్‍ఐతో ముకేశ్ ఖన్నా చెప్పాడు. అయితే, ఇన్ని తప్పులు చేసి కూడా ఇది తమ వెర్షన్ రామాయణం అని సమర్థించుకుంటున్నారని ఆదిపురుష్ టీమ్‍ను ముకేశ్ ఖన్నా.. విమర్శించాడు.

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న విడుదలైంది. మొదటి మూడు రోజులు రూ.300 కోట్లపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తర్వాత రెండు రెండు రోజుల్లో కనీసం రూ.50కోట్లను కూడా కలెక్ట్ చేయలేకపోయింది. కలెక్షన్లు భారీగా పడిపోతున్నాయి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, హనుంతుడిగా దేవ్‍దత్త నాగే నటించారు.

ఆదిపురుష్ సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‍ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Whats_app_banner