Mohanlal - Lijo Jose Pellissery Movie: రెజ్లర్ క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ - జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా...
Mohanlal - Lijo Jose Pellissery Movie: జల్లికట్టు దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీతో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు.
Mohanlal - Lijo Jose Pellissery Movie: జల్లికట్టు ఏమాయు లాంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు లిజో జోస్ పెల్లిసరీ. జల్లికట్టు సినిమా ఇండియా తరుఫున ఆస్కార్ ఎంట్రీని దక్కించుకున్నది. ఫైనల్ నామినేషన్స్‌లో మాత్రం సినిమా నిలవలేదు. తాజాగా దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.
ఈ సినిమాకు మలైకొట్టై వలిబన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో మోహన్‌లాల్ రెజ్లర్‌గా నటించబోతున్నాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సైకలాజికల్ థ్రిల్లర్‌గా మలైకొట్టై వలిబన్ రూపొందనున్నట్లు సమాచారం. జనవరిలో ఈసినిమా షూటింగ్ మొదలుకానుంది. రాజస్థాన్‌లో షూటింగ్ మొత్తాన్ని జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. .
ఈ సినిమాకు పలువురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నిషియన్స్ పనిచేయబోతున్నారు. ప్రస్తుతం మమ్ముట్టితో నపకల్ నెరత్తు మయక్కమ్ అనే సినిమా చేస్తున్నాడు లిజో జోస్ పెల్లిసరీ. కేరళ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈసినిమా విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.
టాపిక్