Mayabazar for sale ott release date: రానా మాయాబజార్ ఫర్ సేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే-mayabazar for sale ott release date is here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mayabazar For Sale Ott Release Date: రానా మాయాబజార్ ఫర్ సేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Mayabazar for sale ott release date: రానా మాయాబజార్ ఫర్ సేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Jun 27, 2023 07:08 PM IST

Mayabazar for sale ott release date: రానా మాయాబజార్ ఫర్ సేల్ ఓటీటీ రిలీజ్ డేట్ తెలిసిపోయింది. రానా దగ్గుబాటి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్
మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్

Mayabazar for sale ott release date: జీ5 ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు మాయాబజార్ ఫర్ సేల్. రానా దగ్గుబాటి ఈ సిరీస్ ను తన స్పిరిట్ మీడియా బ్యానర్ లో నిర్మించాడు. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో రూపొందుతోంది.

సిరీస్ జులై 14 నుంచి జీ 5 (zee 5)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌గా గౌత‌మి చ‌ల్ల‌గుల్ల వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజీవ్ రంజ‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మాయాబజార్ ఫర్ సేల్ స్టోరీ ఇదీ..

పాస్ట్రీ, గాంధీ, హిప్పీ, బ్యాచిల‌ర్స్‌, ప్రేమికుల జంట ఇలా ప‌లు ర‌కాలైన కుటుంబాల‌న్నీ క‌లిసి ఓ గేటెడ్ క‌మ్యూనిటీలో ఉంటాయి. అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే విలక్ష‌ణ‌మైన కుటుంబాల మ‌ధ్య ఉండే నాట‌కీయ‌త‌ను మాయాబజార్ ఫ‌ర్ సేల్‌ సిరీస్‌లో ఆవిష్క‌రించ‌బోతున్నారు. ఈ గేటెడ్ క‌మ్యూనిటీలో ఉండే వారంద‌రూ ప్ర‌శాంత‌మైన జీవ‌నాన్ని గ‌డ‌పాల‌ని అనుకుంటుంటారు.

ఆ స‌మ‌యంలో వారి గేటెడ్ క‌మ్యూనిటీ అన‌ధికారికమైన క‌ట్ట‌డ‌మంటూ ప్ర‌భుత్వం నుంచి ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. వాటిని కూల‌గొట్ట‌డానికి బుల్డోజ‌ర్స్ వ‌స్తాయి. నేటి ఆధునిక స‌మాజంలో కుటుంబాలు ఎలా ఉన్నాయ‌నే వాటితో పాటు సామాజిక జీవన విధానం ఎలా ఉంద‌నే విష‌యాల‌ను మాయాజ‌బార్ ఫ‌ర్ సేల్ ఒరిజిన‌ల్‌లో వ్యంగ్యంగా, హాస్యాన్ని క‌ల‌బోసి చూపించ‌బోతున్నారు.

ఇందులో న‌వ‌దీప్, ఈషా రెబ్బా, న‌రేష్ విజ‌య్ కుమార్‌, హ‌రితేజ‌, ఝాన్సీ ల‌క్ష్మీ, మియాంగ్ చంగ్‌, సునయన, కోట శ్రీనివాస‌రావు త‌దిత‌రులు త‌మ‌దైన అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రాణం పోశారు. జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ ‘‘మాయాబజార్ ఫర్ సేల్ వంటి మరో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం. మ‌న అంద‌రికీ న‌చ్చేలా సునిశిత‌మైన కామెడీతో రూపొందిన ఈ ఒరిజిన‌ల్ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

దర్శకుడు గౌతమి చిల్లగుల్ల మాట్లాడుతూ ‘‘ప్రజలందరూ ఈ మాయబజార్ ఫర్ సేల్ సిరీస్ చూసే సమయంలో తమని తాము అద్దంలో చూసుకున్నట్లు ఫీల్ అవుతారు. వారి జీవితాల్లో సంతోషాలు, బాధలు అన్నీ ఉంటాయి. నాకు నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్భుతమైన సపోర్ట్ అందించారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి స‌పోర్ట్ రానుందోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం